ఒబామా వచ్చేస్తున్నాడు.. అమెరికాలో ఆసక్తిగా మారిన అధ్యక్ష ఎన్నికలు - MicTv.in - Telugu News
mictv telugu

ఒబామా వచ్చేస్తున్నాడు.. అమెరికాలో ఆసక్తిగా మారిన అధ్యక్ష ఎన్నికలు

October 17, 2020

ngvngvhm

అమెరికా అధ్యక్ష ఎన్నికలు రానురాను మరింత ఆసక్తిని పెంచేస్తున్నాయి. ట్రంప్, జో బిడెన్ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. పోటా పోటీగా ప్రచార పర్వంలో నేతలు ఇద్దరూ దూసుకువెళ్తున్నారు. ఈ క్రమంలో డెమొక్రటిక్ పార్టీ సరికొత్త వ్యూహం వేసింది. ఈసారి అధ్యక్ష అభ్యర్థి  జో బిడెన్ తరుపున ప్రచారం కోసం మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామాను రంగంలోకి దింపింది. త్వరలోనే ఆయన ప్రచార ర్యాలీలో పాల్గొనబోతున్నారని వెల్లడించారు. 

వచ్చేవారం పెన్సిల్వేనియాలో జరిగే ర్యాలీలో ఆయన పాల్గొని ప్రసంగించనున్నారు. మాజీ అధ్యక్షుడు నేరుగా ప్రచార కార్యక్రమంలో పాల్గొనడం ఇదే తొలిసారి అని పలువురు విశ్లేషకులు చెబుతున్నారు. దీంతో అధ్యక్ష ఎన్నికలు కొత్త చరిత్రను సృష్టించబోతున్నాయి. ఇంతకుముందు మాజీలు ఆన్‌లైన్ వేదికల ద్వారా మాత్రమే మద్దతు ప్రకటించే వారు. కానీ ఆయన మాత్రం నేరుగా ప్రచార పర్వంలోకి దిగుతున్నారు. దీంతో బిడెన్ బృందం ఇది మరింత కలిసి వచ్చే అంశంగా చెబుతోంది. నాలుగేళ్ల క్రితం వరకు అధ్యక్షుడిగా ఉన్న ఒబామా మైక్ ముందుకు రావడంతో ప్రజలు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కాగా, ఒబామా హయాంలో జో బైడెన్ ఉపాధ్యక్షుడిగా ఉన్న సంగతి తెలిసిందే.