ఉగ్రవాదిని తీసుకెళ్లడానికి ట్రక్కు.. ఎంత బరువున్నాడంటే.. - MicTv.in - Telugu News
mictv telugu

ఉగ్రవాదిని తీసుకెళ్లడానికి ట్రక్కు.. ఎంత బరువున్నాడంటే..

January 17, 2020

Obesity militant arrest.

ఉగ్రవాది అనగానే తుపాకీ పట్టుకున్న యువకుల చిత్రం గుర్తుకొస్తుంది. ముసలాళ్లు, మధ్యవయస్కులు కూడా ఉగ్రవాదుల్లో ఉంటారుగాని, వాళ్లదంతా రహస్య వ్యవహారం కనుక కేవలం వీడియోల్లోనే ఉపన్యాసాలు దంచికొడుతుంటారు. దాడుల పని మాత్రం కుర్ర ఉగ్రవాదులదే. అయితే ఉగ్రవాదుల్లో లావు ఉగ్రవాదుల వేరు అన్నట్లు ఓ ఉగ్రవాది ప్రపంచాన్ని ఆశ్చర్యంలో ముంచెత్తుతున్నాడు. కరడుగట్టిన ఐసిస్‌కు చెందిన ఆ ఉగ్రవాదిని ఇరాక్ పోలీసులు తాజాగా ఓ బ్రోతల్ హౌస్‌లో అరెస్ట్ చేశారు. అతణ్ని తీసుకెళ్లడానికి ఏకంగా ఒక ట్రక్కునే పట్టుకొచ్చాడు. అతడు కారులో, జీపులో పట్టకపోవడమే దీనికి కారణం. 

ఉగ్రవాదుల్లోనే అత్యంత స్థూలకాయుడైన ఈ మహానుభావుడి పేరు సిఫా అల్ నిమా. ఇటీవల మోసుల్‌లోని వ్యభిచార గృహంపై పోలీసులు దాడి చేసి పట్టుకున్నారు. అతని బరువు 150 కేజీలకుపైనే. అతడు ఇస్లాం పేరుతో ఫత్వాలు జారీ చేయడం దగ్గర్నుంచి అనేక మందిని చంపించాడు. అంతబరువు ఉన్నా అనేక అత్యాచారాలకు పాల్పడ్డారని చెబుతారు. ఇతర మతాలవారిపై అత్యాచారాలకు పాల్పడండడని ఐసిస్ ఉగ్రవాదులకు నూరిపోసేవాడు. చివరకు ఇస్లాం మతపెద్దలకే చెందిన సమాధులను కూడా కూలగొట్టించాడు. జాతుల ప్రక్షాళన పేరుతో నానా దురాగతాలకు పాల్పడ్డాడు. మసీదులు ఇస్లాంకు వ్యతిరేకమంటూ ఎన్నో పురాతన మసీదులను ధ్వంసం చేయించాడు. అతనిపై అటు ముస్లిం దేశాల్లో, ఇటు పాశ్చాత్య సైన్యాల్లో అనేక జోకులు ప్రచారంలో ఉన్నాయి.