దీపావళి వేడుకలు మతస్వేచ్ఛకు నిదర్శనం..ట్రంప్ - MicTv.in - Telugu News
mictv telugu

దీపావళి వేడుకలు మతస్వేచ్ఛకు నిదర్శనం..ట్రంప్

October 26, 2019

Trump

దీపావళి సంబరాలు అప్పుడే మొదలయ్యాయి. దేశవ్యాప్తంగా పండగ సందడి కనిపిస్తోంది. అమెరికాలోని వైట్ హౌజ్‌లో ఈసారి దీపావళి వేడుకుల ఘనంగా జరిగాయి. ఓవల్‌ ఆఫీస్‌లో శుక్రవారం జరిగిన ఈ వేడుకల్లో అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా ట్రంప్‌ మాట్లాడుతూ..నేడు అమెరికా అంతటా దీపావళి జరుపుకొంటున్నారు. దేశ ప్రధాన సిద్ధాంతాలలో ఒకటైన మతస్వేచ్ఛకు ఈ పండుగ నిదర్శనమని వ్యాఖ్యానించారు. ప్రపంచవ్యాప్తంగా దీపావళి జరుపుకొంటున్న హిందువులు, సిక్కులు, జైనులు, బౌద్ధులకు ట్రంప్‌ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ పండుగను చీకటిపై వెలుతురు, అజ్ఞానంపై జ్ఞానం, చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకొంటారని గుర్తుచేసుకున్నారు. 2009 నుంచి వైట్ హౌజ్‌లో దీపావళి జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. అప్పటి అధ్యక్షుడు బరాక్ ఒబామా తొలిసారి వైట్ హౌజ్‌లో నిర్వహించిన దీపావళి వేడుకల్లో పాల్గొన్నారు.