October in the year 1582 had 10 days missing
mictv telugu

క్యాలెండర్లో 10 రోజులు ఎలా మాయమయ్యాయి!

November 29, 2022

నెలలో ఎన్ని రోజులుంటాయి? కొన్ని నెలల్లో 30, మరికొన్ని నెలల్లో 31 రోజులుంటాయి. ఫిబ్రవరిలో మాత్రం 28, లీప్ సంవత్సరాల్లో 29. ఇంతకుమించి క్యాలెండర్ మారుతుందా? 1582లో మాత్రం మారింది. ఎందుకలా..?

క్యాలెండర్స్ మనకు కచ్చితమైన రోజులు, తేదీలను అందిస్తాయి. అయితే 1582వ సంవత్సరంలో అక్టోబర్ లో సాధారణం కంటే 10 రోజులు తక్కువగా ఉన్నాయి. మామూలు క్యాలెండర్ లో మొత్తం రోజులు ఉన్నాయి. కానీ ఫోన్ క్యాలెండర్ లో మాత్రం ఆ రోజులు కనిపించవు. ఇప్పుడు ఆ క్యాలెండర్ ని ఇంటర్నెట్ లో చాలామంది ట్వీటుతున్నారు. అసలు 1582లో ఏం జరిగిందో చదువండి.
అక్టోబర్ 1582లో సాధారణంగా 31 రోజుల కంటే 10 రోజులు తక్కువగా ఉన్నాయని కనుగొన్న చాలామంది అనేక ట్వీట్లు చేశారు. ఒకసారి మీ ఫోన్ క్యాలెండర్ స్క్రోల్ చేస్తే ఆ సంవత్సరంలో అక్టోబర్ అసాధారణంగా ఉందని మీరు గమనించవచ్చు. అక్టోబర్ 4 నుంచి 15కి నేరుగా జంప్ అవుతుంది. మరి అక్టోబర్ 5 నుంచి 14 వరకు ఏమైనట్టు? దీని వెనుక బలమైన కారణం ఉండే ఉంటుందని చాలామంది కామెంటుతున్నారు. అమెరికన్ ఖగోళ భౌతిక శాస్త్రవేత్త, సైన్స్ కమ్యూనికేటర్ నీల్ డిగ్రాస్ టైసాన్ ఈ రహస్యం వెనుక కారణాన్ని ట్వీట్ లో వివరించారు. అతను ‘1582 నాటికి జూలియన్ క్యాలెండర్ ప్రతి నాలుగు సంవత్సరాలకు ఒక లీప్ డేతో, భూమి కక్ష్యకు సంబంధించి అదనపు రోజులను సేకరించింది. కాబట్టి పోప్ గ్రెగొరీ తన కొత్త, కచ్చితమైన క్యాలెండర్ను రూపొందించాడు. అందులో 10 రోజులను రద్దు చేయడం ద్వారా ప్రారంభించాడు. అలా అక్టోబర్ 4 తర్వాత 15 వచ్చింది’ అని వివరించారు. అయితే ఇతర నెలలో కాకుండా కేవలం అక్టోబర్ నెలలోనే ఎందుకీ తేడా అనే సందేహం చాలామంది వ్యక్తం చేశారు.

ఈస్టర్ తేదీని లెక్కించడం కష్టతరంగా ఉన్నందున ఈ సమస్య ముందుకు వచ్చింది. బ్రిటానికా ప్రకారం.. 1562‌‌_63 సంవత్సరాల్లో ట్రెంట్ కౌన్సిల్ సంస్కరించబడిన క్యాలెండర్ ను అమలు చేయడం ద్వారా సమస్యను పరిష్కరించాలని పోప్ ను కోరుతూ ఒక డిక్రీని ఆమోదించాలని నిర్ణయించింది. కానీ దానికి తగిన పరిష్కారాన్ని కనుగొని దానిని అమలులోకి తీసుకురావడానికి మరో రెండు దశాబ్దాలు పట్టింది. పోప్ గ్రెగొరీ XIII ఫిబ్రవరి 1582లో గ్రెగోరియన్ క్యాలెండర్ అని పిలువబడే సంస్కరించబడిన క్యాలెండర్ ని ప్రకటిస్తూ పాపల్ బుల్ పై సంతకం చేశాడు. అయితే క్రైస్తవ పండుగలను దాటవేయకుండా ఉండడానికి వీరు అక్టోబర్ ను ఎంచుకుంది. అలా అక్టోబర్ లో 10 రోజులు మాయమయ్యాయి.