అక్టోబర్ లో..గోవాలో పెళ్లివేడుక రారండోయ్.. - MicTv.in - Telugu News
mictv telugu

అక్టోబర్ లో..గోవాలో పెళ్లివేడుక రారండోయ్..

May 27, 2017

అక్కినేని ఇంట్లో అక్టోబర్ లో పెళ్లిబాజాలు మోగబోతున్నాయి. నాగచైతన్య – సమంత ల పెళ్లి గోవాలో జరుగనుంది. పరిమిత సంఖ్యలో బంధు మిత్రుల మధ్య ఈ వేడుకని జరపాలని ఇరు కుటుంబాలు నిర్ణయించుకున్నాయి..పెళ్లి ఎక్కడ జరిగినా హైదరాబాద్‌లో మాత్రం విందు కార్యక్రమాన్ని నిర్వహించాలని నాగార్జున భావిస్తున్నారు. పెళ్లికి మరో ఐదు నెలల సమయం మాత్రమే ఉండటంతో ఆలోపుగా సమంత, నాగచైతన్యలు చేతిలో ఉన్న సినిమాల్ని పూర్తి చేసుకోవాలని నిర్ణయించుకొన్నారట. పెళ్లి తర్వాత ఇద్దరూ నెల రోజులకిపైగా సెలవు తీసుకొంటారట. హనీమూన్‌ కోసం న్యూయార్క్‌ వెళ్లబోతున్నారు.