అద్భుతమైన వీడియో.. రంగులు మారుస్తున్న ఆక్టోపస్ - MicTv.in - Telugu News
mictv telugu

అద్భుతమైన వీడియో.. రంగులు మారుస్తున్న ఆక్టోపస్

July 7, 2022

భూమ్మీద ఉన్న జంతు ప్రపంచంలో రకరకాల వింతలు, అద్భుతాలు ఉన్నాయి. అయితే ఇవి మనకు కనిపించేవి. మనం చూడలేం కానీ, భూమ్మీద కంటే కూడా నీటిలోని ప్రాణుల్లో ఇంకా అద్భుతాలు దాగి ఉంటాయి. అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చూసిన వారందరి చేత వావ్ అనిపించేలా ఉన్న ఈ వీడియోలో ఓ అక్టోపస్ ఈత కొడుతూ రకరకాల రంగులు మారుస్తూ ఉంటుంది. సముద్రం అడుగున నివసించే ఈ జీవులు తమను తాము రక్షించుకోవడానికి ఈ విధంగా రంగులు మారుస్తూ ఉంటాయట. అలాగే ఊసరవెళ్లిలాగా అక్కడి పరిసరాలకు తగ్గట్టు తమను మార్చుకొని శత్రువును ఏమారుస్తాయంట. మొజాంబిక్ తీరంలో తీసిన ఈ వీడియోను వండర్ ఆఫ్ సైన్స్ ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది.