భారీ ఎన్‌కౌంటర్.. ఐదుగురు మావోల  మృతి.. - MicTv.in - Telugu News
mictv telugu

భారీ ఎన్‌కౌంటర్.. ఐదుగురు మావోల  మృతి..

May 8, 2019

ఒడిశాలో భద్రతా బలగాలకు, మావోయిస్టులకు మధ్య ఈ రోజు భారీ  ఎన్ కౌంటర్ జరిగింది. ఈ కాల్పుల్లో ఐదుగురు మావోయిస్టులు హతమయ్యారు. ఈ ఘటన కోరాపుట్ జిల్లా పాడువా పోలీస్ స్టేషన్  పరిధిలో చోటు చేసుకుంది. వారి నుంచి 3 ఎస్‌ఎస్‌ఆర్, 2 ఇన్సాస్ ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. కాగా కిటుబకంటి అటవీ ప్రాంతంలో కాల్పులు ఇంకా కొనసాగుతున్నాయి.

భద్రతా సిబ్బంది సరిహద్దులో కూంబింగ్ నిర్వహిస్తున్న సమయంలో మావోయిస్టులు ఒక్కసారిగా వారిపైకి కాల్పులు జరిపడం ప్రారంభించారు. దీంతో అప్రమత్తమైన భద్రతా సిబ్బంది వెంటనే ఎదురుకాల్పులు జరిపి, ఐదుగురు మావోయిస్టులను హతమార్చారు.