విషసర్పం కాటుకు ఆడ సింహం బలి - MicTv.in - Telugu News
mictv telugu

విషసర్పం కాటుకు ఆడ సింహం బలి

May 28, 2022

పాము కాటుకు ఓ ఆడ సింహం బలైంది. ఒడిశా భువనేశ్వర్లోని నందన్కనన్ జూ పార్క్లో శనివారం ఈ ఘటన జరిగింది. ఎన్క్లోజర్లో ఉన్న ఆడసింహం గంగను.. శుక్రవారం ఓ తాచుపాము కాటేసినట్లు అధికారులు తెలిపారు. సింహానికి సమీపంలోని ఓ వాటర్ ట్యాంక్ వద్ద విషపూరిత పాము ముడుచుకొని ఉందని, అదే కాటేసి ఉంటుందని భావిస్తున్నారు. చికిత్స చేస్తుండగా ఆ సింహం చనిపోయిందని జూ సిబ్బంది తెలిపారు. సింహాన్ని కాపాడేందుకు డాక్టర్లు తీవ్రంగా శ్రమించినా ప్రాణాలు దక్కలేదని చెప్పారు. పోస్టుమార్టం తర్వాత సింహం మరణానికి అసలు కారణం తెలుస్తుందన్నారు.