ఒడిశాకు చెందిన ఎల్ ఈశ్వర్ రావు అనే కళాకారుడు అద్భుతం చేశాడు. చిన్న హాకీ స్టిక్, బాల్ ని చెక్కాడు. వాటిని 750మి.లీ.ల బాటిల్ ఉంచాడు.
ప్రపంచకప్ హనున్నాయి. ఈ సందర్భంగా ఒక్కొక్కరు ఒక్కోలా శుభాకాంక్షలు తెలుపుతుంటారు. ఇక కళాకారుడు కూడా కొత్తగా చెప్పాలనుకున్నాడు. తనకు తెలిసిన మీనియేచర్ ని ఎంచుకున్నాడు. ప్రపంచకప్ లో పాల్గొనే అన్ని జట్లకు ‘బెస్ట్ ఆఫ్ లక్’ చెబుతూ తనకి తెలిసిన మీనియేచర్ ని ఎంచుకున్నాడు.
ఈగ సినిమా గుర్తుంది కదా! అందులో సమంత చిన్న చిన్న కళారూపాలను సృష్టించడం చూశాం కదా! అలాగే ఈశ్వర్ రావు కూడా 25 యేండ్లుగా ఈ కళాఖండాన్ని అభ్యసిస్తున్నాడు. అతను రెండవ తరగతిలో ఉన్నప్పటి నుంచి ఈ కళ మీద మక్కువతో నేర్చుకోవడం మొదలుపెట్టాడు. 12వ తరవగతిలో ఉన్నప్పుడు మొదటిసారి తన ఉపాధ్యాయుడికి బహుమతి ఇచ్చాడు. అంటే.. 1999లో సుద్దతో తాజ్ మహల్ ను చేసి బహుమతి ఇవ్వడంతో, ఆ ఉపాధ్యాయుడు ఎంతగానో మెచ్చుకున్నాడు. ఆ మెప్పుతో రావు మరింత కసిగా తన ప్రయాణాన్ని కొనసాగించాడు. 2011లో రావు తన స్వంత ఫౌండేషన్ ‘ఈశ్వర్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ సోషల్ ఫౌండేషన్’ మొదలు పెట్టాడు. దాని ద్వారా తన విద్యను ఉచితంగా నలుగురికీ పంచుతున్నాడు.
హాకీ టోర్నీ..
ప్రపంచకప్ హాకీ టోర్నీ జనవరి 13 నుంచి 29 వరకు ఒడిశా రాజధాని భువనేశ్వర్ రూర్కెలాలో జరుగనుంది. ప్రపంచకప్ హాకీ ఆ రాష్ట్రంలో రెండవసారి జరుగుతునది. ఈ ఈవెంట్లలో 16 జట్లు పాల్గొంటున్నాయి. తన కళ ద్వారా ఆ జట్లకు శుభాకాంక్షలు తెలియచేయాలనుకున్నాడు. రావు మోడల్ కోసం సుద్ద, గాజు, గ్లిట్లర్ పేపర్ ను ఉపయోగించాడు. ఒక సీసాలో సూక్ష్మ శిల్పాన్ని రూపొందించడానికి తనకు ఎనిమిది రోజులు పట్టింది.
కష్టంతో..
‘నేను నాలుగేళ్ల పాటు రాతి చెక్కడం పై శిక్షణ తీసుకున్నాను. ఈ మీనియేచర్ ని మాత్రం సొంతంగా కష్టపడి నేర్చుకున్నాను. ఖుర్దా జిల్లాలోని జట్నీ మ్యాప్ ని పెన్సిల్ నిబ్ పై చెక్కడానికి పది రోజులు పట్టింది. పెన్సిల్ శిల్పాలు అర అంగుళం కంటే తక్కువ కూడా చెక్కుతాను. నాకు ఈ పనిలో ఎంతో సంతోషం దొరుకుతుంది’ అంటున్నాడు రావు..