గర్ల్‌ఫ్రెండ్‌తో బీజేడీ ఎమ్మెల్యే రాసలీలలు.. ఫోటోలు వైరల్ - MicTv.in - Telugu News
mictv telugu

గర్ల్‌ఫ్రెండ్‌తో బీజేడీ ఎమ్మెల్యే రాసలీలలు.. ఫోటోలు వైరల్

June 21, 2022

ప్రేమ పేరుతో ఓ యువతిని మోసం చేసిన బీజేడీ ఎమ్మెల్యే అడ్డంగా బుక్కయ్యాడు. సదరు యువతి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అతనిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. ఒడిషాలోని జగత్ సింఘ్ పూర్ జిల్లా తిర్తోల్ ఎమ్మెల్యే బీజేపీ నాయకుడు విజయశంకర దాస్ తనను మోసం చేశాడని
సోమాలిక దాస్ (29) అనే యువతి జగత్ సింఘ్ పూర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది.

తమ ప్రేమను పెళ్లిగా మార్చుకుందామని కోరిక మేరకు రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుందామని తనతో చెప్పాడని చెప్పిందా యువతి. దీనికి సంబంధించి జగత్ సింగ్ పూర్ జిల్లా రిజిస్ట్రార్ ఆఫీస్ లో వివాహం కోసం అందుకు అవసరమైన డాక్యుమెంట్లను కూడా ఈ ఏడాది మే 17న అప్లయి చేశామని తెలిపింది. ఈనెల 17తో నెలరోజులు పూర్తి కావడంతో ఆ రోజున పెళ్లి కోసమని రిజిస్ట్రార్ ఆఫీసుకు వెళ్లానని చెప్పింది. అక్కడ 3 గంటలకు పైగా ఎదురు చూసినా విజయశంకర్ దాస్ రాలేదని, ఫోన్ చేసినా స్పందించకపోవడంతో మోసపోయానని గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేశానని పేర్కొంది. మరోవైపు ప్రియుడితో చనువుగా తిరిగిన ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

అయితే ఇదంతా తొందరపాటు చర్యగా ఎమ్మెల్యే కొట్టేశారు. సోమాలికను వివాహమాడతానని ఆదివారమే చెప్పానన్నారు. రిజిస్టర్‌ మ్యారేజ్ దరఖాస్తు దాఖలు నుంచి 90 రోజుల గడువు లోగా పెళ్లి చేసుకునేందుకు వీలవుతుందని గుర్తుచేశారు. ప్రస్తుతం 30 రోజులు మాత్రమే పూర్తయ్యిందని, మరో 60రోజులు గడువు ఉందన్నారు. ఈలోగా మంచి ముహూర్తంలో రిజిస్టర్‌ వివాహం చేసుకోనున్నట్లు తెలిపారు.