Odisha Bride eloped with boyfriend after marriage in Balangir district
mictv telugu

పెళ్లయిన రోజే ప్రియుడితో లేచిపోయింది.. వీడియో..

February 21, 2023

Odisha Bride eloped with boyfriend after marriage in Balangir district

పిల్లల ఇష్టాయిష్టాలు తెలుసుకోకుండా పెద్దలు తమకిష్టం వచ్చిన సంబంధాలు చూసి పెళ్లి చేయడం వల్ల చాలా ఘోరాలు జరిగిపోతున్నాయి. భర్తలు భార్యలను, భార్యలు భర్తలను, భర్తలు తమ భార్యల ప్రియుళ్లను, భార్యల ప్రియుళ్లు వారి భర్తలను, చివరికి అడ్డని భావించిన పిల్లలను, అత్తమామలను అందర్నీ సఫా చేసిపారేస్తున్నారు. అదొక నేర పురాణమైతే, కాళ్ల పారాణి కూడా ఆరకముందే కొంతమంది పెళ్లి కూతుళ్లు పక్కా ప్లాన్ ప్రకారం భర్తలకు మస్కా కొట్టి ప్రియుళ్లతో జంప్ జలానీ అని వెళ్లిపోయి పుట్టింటి పరువు, మెట్టింటి పరువు దిష్టినీళ్లలా తీసిపారేస్తున్నారు. పెళ్లయిన రోజు సాయంత్రమే ఓ కొత్తపెళ్లికూతురు రాకెట్ లా జూమ్మని ప్రియుడి బైక్‌పై లేచిపోయింది. ఒడిశాలోని బాలాంగిర్ జిల్లా బ్రాహ్మణ పడలో ఈ దారుణం జగింది. ఆ మహాప్రేమికురాలు పోతూ పోతూ పెళ్లికొడుకు తనకు పెట్టిన బంగారు నగలను, వెండిపట్టీలను కూడా ఎత్తుకుపోయింది.

ముకంద్ పార్ గ్రామానికి చెందిన ప్రేమ్ కుమార్ అనే యువకుడికి బ్రాహ్మణ పడకు దిన లిజా మహాకూర్‌తో పెళ్లయింది. మరికాసేపట్లో భర్తతో కలసి మెట్టింటికి వెళ్లాల్సిన లిజా ప్లాన్ అమలు చేసుంది. పక్క గల్లీకి ప్రియుణ్ని పిలించుకుని, పొద్దుగూకగానే దొంగచాటుకు బయటికి వెళ్లి తుర్రుమంది. బాయ్ ఫ్రెండ్ ఆమెను తన బండి ఎక్కించుకుని వెళ్తున్న దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. దిక్కుతెలియన నవవరుడు పోలీస్ స్టేషన్ కు వెళ్లి కేసు పెట్టాడు.