హాకీ వరల్డ్ కప్‌ను భారత్ జట్టు గెలిస్తే ఒక్కో ప్లేయర్‌కి రూ.కోటి నజరానా ఇస్తానని ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ప్రకటించారు. మరో వారం రోజుల్లో ఒడిశాలోని హాకీ ప్రపంచకప్ ప్రారంభం కానుంది. ఈ మేరకు రూర్కెలాలో బిర్సా ముందా హాకీ స్టేడియం కాంప్లెక్స్ వద్ద ప్రపంచ కప్ విలేజ్‌ను ఆయన ప్రారంభించారు. అనంతరం టీం ఇండియాకు బెస్ట్ బిషెస్ తెలిపి కాసేపు వారితో ముచ్చటించారు. ప్రపంచ కప్‌ను గెలిచి, ఛాంపియన్లుగా నిలవాలని సూచించారు.
భారత్‌లో వరుసగా రెండోసారి హాకీ ప్రపంచకప్ నిర్వహిస్తున్నారు. జనవరి 13 నుంచి జనవరి 29 వరకు ప్రపంచకప్ మ్యాచ్‌లు జరగనున్నాయి. ఇందులో మొత్తం 16 జట్లు పాల్గొంటాయి. ప్రపంచకప్ మొత్తం ఒడిశాలోని రెండు స్టేడియాల్లో జరగనుంది. దీని కోసం వరల్డ్ కప్ విలేజ్‌ను అత్యాధునిక సౌకర్యాలతో నిర్మించారు. 9 నెలల్లో 225 గదుల నిర్మాణం చేపట్టారు. ప్రపంచ కప్ ఆడేందుకు వచ్చే దేశాల జట్లు, అధికారులు వరల్డ్ కప్ విలేజ్‌లో ఉంటారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఒడిశాకు చెందిన పలువురు మంత్రులు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు. హాకీ ప్రపంచ కప్ ను ఇంటర్నేషనల్ హాకీ ఫెడరేషన్ నాలుగేళ్లకు ఒసారి నిర్వహిస్తుందన్న సంగతి తెలిసిందే..