అందుకు సోనూ సూద్ ను ప్రశంసించాల్సిందే..ఒడిశా సీఎం - MicTv.in - Telugu News
mictv telugu

అందుకు సోనూ సూద్ ను ప్రశంసించాల్సిందే..ఒడిశా సీఎం

May 31, 2020

sooon 

లాక్ డౌన్ కారణంగా పరాయి రాష్ట్రాల్లో ఉండిపోయిన కార్మికులను తరలించడంలో నటుడు సోనూ సూద్ కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెల్సిందే. దీంతో సోనూ సూద్ పేరు దేశవ్యాప్తంగా మారుమోగుతోంది. దేశవ్యాప్తంగా నెటిజన్లు సోనూ సూద్ చేస్తున్న కృషిని ప్రసంశిస్తున్నారు. కొందరు అయితే ఏకంగా సూద్ సూద్ కు భారతరత్న ఇవ్వాలని సోషల్ మీడియాలో డిమాండ్ చేస్తున్నారు. దీని గురించి సోను సూద్ మాట్లాడుతూ.. తాను ఇదంతా చేస్తుంది పేరు కోసం కాదని, కేవలం మానవతా దృక్పధంతో చేస్తునట్టు తెలిపాడు.

ఇటీవల కేరళలో చిక్కుకుపోయిన ఒడిశా యువతులను సూనూ సూద్ ప్రత్యేక ఫ్లైట్ ఏర్పాటు చేసి స్వస్థలానికి చేర్చారు. దీనిపై ఒడిశా సీఎం నవీన్‌ పట్నాయక్ స్పందించారు.‌ సూనూ సూద్ తీసుకున్న చొరవకు కృషికి ప్రశంసలు కురిపించారు. ”ఒడిశా మహిళలకి సహాయం చేసేందుకు ముందుకు వచ్చిన బాలీవుడ్‌ నటుడు సోనూ సూద్‌కు ధన్యవాదాలు. కోవిడ్‌-19 లాక్‌డౌన్‌ కారణంగా కేరళలో చిక్కుకుపోయిన వారిని క్షేమంగా ఇంటికి చేర్చేందుకు చొరవ చూపారు. ఆయన మానవతాదృక్పథాన్ని ప్రశంసించి తీరాల్సిందే.” అని నవీన్ పట్నాయక్ ట్వీట్‌ చేశారు. కేరళలో చిక్కుక్కుపోయిన నా అక్కా చెల్లెళ్ళని ఇంటికి పండం నా బాధ్యతగా భావించాను. దీనికి సోనూ సూద్ స్పందిస్తూ..’మీ మాటలు నాలో స్పూర్తిని నింపాయి. ధన్యవాదాలు సర్. దేశంలోని వలస కార్మికులని వారి స్వస్థలాలకి పంపేందుకు నేనే ఎల్లప్పుడు సిద్ధంగానే ఉంటాను.’ అని బదులిచ్చారు.