వినూత్న వివాహం.. రక్తదానంతో కన్యాదానం - MicTv.in - Telugu News
mictv telugu

వినూత్న వివాహం.. రక్తదానంతో కన్యాదానం

October 23, 2019

Odisha  ,.

పెళ్లి అంటే చాలు బ్యాండ్ బాజాలు, బంధువుల హడావిడి, హంగూ.. ఆర్బాటాలు ఉంటాయి. ఎవరి విశ్వాసాలు,నమ్మకాలకు అనుగుణంగా సంప్రదాయ పద్దతిలో పెళ్లిలు జరుగుతుంటాయి. కానీ ఓ ప్రేమ జంట చేసుకున్న వినూత్న వివాహం అందరిని ఆశ్చర్యంలో ముంచెత్తుతోంది. తమ పెళ్లికి సాక్ష్యంగా ఏకంగా రాజ్యాంగంపై ప్రమాణం చేసి ఆ జంట ఏకమైంది. రక్త దానం చేసి తమ నూరేళ్ల బందానికి బాటలు వేసుకున్నారు. ఒడిశాలోని బెర్హంపూర్ నగరంలో ఈ వినూత్న వివాహం జరిగింది. 

విప్లవ్ కుమార్, అనిత కొంత కాలంగా ప్రేమించుకున్నారు. ఇంట్లో పెద్దలను ఒప్పించి వివాహానికి సిద్ధమయ్యారు. అయితే తమ పెళ్లి ఆర్భాటాలకు దూరంగా.. మంచి పనికోసం ఉపయోగపడాలని నిర్ణయించుకున్నారు. అందుకు తగ్గట్టుగా వధూ వరులతో పాటు పెళ్లికి వచ్చిన అతిథులు అంతా రక్తదానం చేశారు. అంతే కాకుండా భారత రాజ్యాంగంపై ప్రమాణం చేసి ఒక్కటయ్యారు.  తమ పెళ్లి తంతు బాణసంచా, బ్యాండ్ బాజాలు ఏమీ పెట్టకుండా నిరాడంబరంగా ముగించారు. కాగా వరుడు విప్లవ్ కుమార్ ఫార్మాస్యూటికల్ కంపెనీలో ఉద్యోగం చేస్తుండగా.. వధువు అనిత నర్సుగా పనిచేస్తున్నారు. తమ వివాహారం ఆదర్శవంతంగా సాగడంపై వారిద్దరూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.