లాక్‌డౌన్..వీధి వ్యాపారులకు రూ.3000 ఆర్థిక సాయం - MicTv.in - Telugu News
mictv telugu

లాక్‌డౌన్..వీధి వ్యాపారులకు రూ.3000 ఆర్థిక సాయం

March 29, 2020

Odisha govt to provide Rs 3,000 to 65,000 vendors amid lockdown due to coronavirus

కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి కేంద్ర ప్రభుత్వం లాక్‌డౌన్ విధించిన సంగతి తెల్సిందే. దీంతో కోట్లాది మంది ప్రజలు ఇళ్లకే పరిమితం అయ్యారు. ఈ కారణంగా ఎందరో ప్రజలు పని కోల్పోయారు. పట్టణాల నుంచి కార్మికులు, కూలీలు సొంతూళ్లకు కాలినడకన వెళ్తున్నారు. లాక్‌డౌన్ కారణంగా ఎందరో విధి వ్యాపారాలు నష్టపోతున్నారు.

దీంతో లాక్‌డౌన్ కారణంగా ఇళ్లకే పరిమితమై వీధి వ్యాపారులకు ఆర్థిక సహాయం చేయాలని ఒడిశా ప్రభుత్వం నిర్ణయించింది. ఒక్కో కుటుంబానికి రూ.3 వేల ఆర్థిక సాయం ప్రకటించింది. తక్షణం ఈ మొత్తాన్ని రాష్ట్రంలోని 114 పట్టణాలు, నగరాల్లో ఉన్న వారికి అందజేయాలని ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ ఆదేశాలు జారీచేశారు. ప్రభుత్వ నిర్ణయంతో మొత్తం 65 వేల మంది వీధి వ్యాపారులకు లబ్ది పొందనున్నారు. అలాగే రాష్ట్రంలోని వలస కార్మికులకు పాఠశాలలు, హాస్టల్ భవనాల్లో వసతి సౌకర్యం కల్పించాలని సీఎం ఆయా జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. దీంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉన్న ఇతర రాష్ట్రాలకు చెందిన వలస కార్మికులను అధికారులు సమీపంలోని పునరావాస కేంద్రాలకు తరలించారు.