Odisha IPS officers’ daughter undergoes sex-change operation
mictv telugu

ఐపీఎస్ దంపతుల కూతురికి లింగమార్పిడి

August 29, 2022

కుమార్తెకు ఆమె ఇష్ట ప్రకారం లింగ మార్పిడి ఆపరేషన్ చేయించారు ఆ ఐపీఎస్ దంపతులు. ఒడిశాలోని ఐపీఎస్ దంపతులకు చెందిన 22 ఏళ్ల కుమార్తె తల్లిదండ్రుల అనుమతితో విజయవంతంగా లింగమార్పిడి శస్త్రచికిత్స (సెక్స్ రీ అసైన్ మెంట్ సర్జరీ) చేయించుకుంది. ఆపరేషన్ విజయవంతం కావటంతో ఇక వారి కుమార్తెకు సంబంధించి డాక్యుమెంట్లలో జెండర్ మార్చే పనిలో పడ్డారు.

ఇటీవలే ఢిల్లీలో సదరు యువతికి లింగమార్పిడి శస్త్రచికిత్స చేయించారు. దీని గురించి స్పందించటానికి సదరు ఐపీఎస్ దంపతులు గానీ..సర్జరీ చేయించుకున్న యువతి గానీ నిరాకరించారు. ఇది మా కుటుంబానికి సంబంధించిన విషయం బయటకు చెప్పాల్సిన పనిలేదు..మా కుమార్తె ఇష్టంమేరకు ఆమె అభిప్రాయాన్ని గౌరవించి ఆమెకు ఆపరేషన్ చేయించామని తెలిపారు.

జెండర్ ఆపరేషన్ చేయించుకున్న సదరు యువతి ప్రస్తుతం అమెరికాలో మేనేజ్ మెంట్ స్టడీస్ చేస్తోంది. లింగ మార్పిడి శస్త్ర చికిత్సను ప్లాస్టిక్ సర్జన్, గైనకాలజిస్ట్, ఎండోక్రైనాలజిస్ట్, సైకియాట్రిస్ట్ తో కూడిన వైద్య బృందం చేస్తుంటుంది. సర్జరీ తర్వాత పూర్తిగా పురుష హార్మోన్లు అభివృద్ధి చెందడానికి రెండేళ్లు పడుతుందని సీనియర్ డాక్టర్ మిశ్రా తెలిపారు.