Home > Featured > భర్తకు హిజ్రాతో పెళ్లి జరిపించిన భార్య.. కారణమిదే

భర్తకు హిజ్రాతో పెళ్లి జరిపించిన భార్య.. కారణమిదే

పెళ్లైన ఓ వ్యక్తి హిజ్రాతో ప్రేమలో పడ్డాడు. ఈ విషయం భార్యకు తెలిసింది. అయితే ఆమె అందరిలా అరిచి గోల చేయలేదు. ఆమెతో మాట్లాడి భర్త పెళ్లి చేసింది. ఈ సంఘటన ఒడిషాలో చోటు చేసుకుంది. డోర్‌కుట్‌ గ్రామానికి చెందిన ఫకీర్‌ నియాల్‌ అనే వ్యక్తికి ఐదేళ్ల క్రితం వివాహం అయ్యింది. వారికి ఓ కుమారుడు కూడా ఉన్నాడు. ఇన్నేళ్లు సంతోషంగా సాగిన వీరి కాపురంలో ఓ హిజ్రా రాకతో కల్లోలం రేగింది.

కలహండి జిల్లా నర్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని డోర్ కుట్ గ్రామానికి చెందిన ఫకీర్ నియాల్ కు.. ఏడాది క్రితం అదే గ్రామానికి చెందిన సంగీత అనే హిజ్రాతో పరిచయం ఏర్పడింది. అది కాస్త ప్రేమగా మారింది. సంగీతను వదిలి ఉండలేని స్థితికి వచ్చాడు ఫకీర్‌. విషయం తెలుసుకున్న భార్య ఆ హిజ్రాతో మాట్లాడి తన భర్తతో ఆదివారం సంప్రదాయబద్ధంగా గ్రామంలోని ఆలయంలో పెళ్లి చేయించింది. తాను ఫకీరును ప్రేమించానని, ఆయన భార్య కొత్త జీవితం ప్రసాదించిందని, ఇప్పుడు నా కోసం ఒక కుటుంబం ఉందనే ఆనందం వ్యక్తం చేసింది.

Updated : 13 Sep 2022 4:05 AM GMT
Tags:    
Next Story
Share it
Top