అప్పు కోసం అమ్మాయి తాకట్టు..హైదరాబాద్‌లో అమానుషం - MicTv.in - Telugu News
mictv telugu

అప్పు కోసం అమ్మాయి తాకట్టు..హైదరాబాద్‌లో అమానుషం

June 2, 2020

హైదరాబాద్ నగరంలో అమానుష సంఘటన జరిగింది. అప్పులు తీర్చేందుకు కన్నా కూతుర్ని తాకట్టు పెట్టింది ఓ పేద తల్లి. ఒడిశాలోని నవరంగపూర్‌ జిల్లాకు చెందిన అనాది పాణిగ్రహి భర్త కొన్నేళ్ల క్రితం మృతిచెందాడు. దీంతో ఖర్చుల కోసం అనాది మైక్రోఫైనాన్స్‌ కంపెనీ నుంచి రూ.30 వేలు అప్పు తీసుకుంది. తరువాత పెద్ద కూతురు ప్రియాంకను గ్రామంలోని బంధువులకు అప్పగించి చిన్న కూతురు సాగరికతో ఐదు నెలల క్రితం ఉపాధి కోసం హైదరాబాద్‌ చేరుకొని ఇటుకల కంపెనీలో పని చేయడం మొదలుపెట్టింది.

క్రమంగా అనాది ఆరోగ్యం క్షీణించింది. ఇటుక పనికి వచ్చిన డబ్బులు తినడానికే సరిపోవడం లేదు. పైగా మందులు తీసుకోవాలి. దీంతో కంపెనీ యజమాని దగ్గర కొంత డబ్బు అప్పు తీసుకుని సాగరికను యజమాని వద్ద తాకట్టు పెట్టి స్వగ్రామానికి వెళ్లింది. కొంత కాలానికే అనారోగ్యంతో మరణించింది. అప్పటికే లాక్‌డౌన్ అమలులో ఉండడంతో సాగరిక తల్లిని చివరి చూపులు చూడడానికి ఇంటికి రాలేకపోయింది. హైదరాబాద్‌లో తాకట్టులో ఉన్న సాగరిక తన బాధను ఒడిశా ప్రభుత్వానికి వివరించింది. కానీ, ఎలాంటి స్పందించలేదు. ఆ బాలికను రక్షించాలని పలు స్వచ్ఛంద సంస్థలు ప్రభుత్వానికి లేఖలు రాసినా ఫలితం లేకుండా పోయిందా. చివరకు ఈ విషయం తెలుసుకున్న నవరంగపూర్‌ మాజీ ఎంపీ ప్రదీప్‌ మఝి వెంటనే వారి గ్రామానికి వెళ్లి పూర్తి విషయాలు సేకరించారు. ఒకరిని హైదరాబాద్‌ పంపి ఆ బాలికను విడిపించి తీసుకొచ్చారు.