ఎమ్మెల్యే ఇంటిని తగలబెట్టేశారు..  - MicTv.in - Telugu News
mictv telugu

ఎమ్మెల్యే ఇంటిని తగలబెట్టేశారు.. 

August 19, 2019

ఆందోళనకారులు ఎంతకైనా తెగిస్తున్నారు. ఒడిశా అధికార పార్టీ బీజేడీ ఎమ్మెల్యే బ్రజ కిశోర్ ప్రధాన్ ఇంటిని కొందరు దుండుగులు బుగ్గిచేశారు. భువనేశ్వర్‌లోని ఈ ఇంటికి ఆదివారం రాత్రి కొందరు దుండగులు చేరుకుని దహన కాండ ప్రారంభించారు. అయితే ఎమ్మెల్యే ఆ సమయంలో ఇంట్లో లేకపోవడంతో ముప్పు తప్పింది. అగ్నికీలలకు ఇల్లు నాశనం కావడంతోపాటు రెండు కార్లు, రెండు మోటార్ సైకిళ్లు బూడిదయ్యాయి.

ప్రధాన్ తల్చేర్ నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఎమ్మెల్యేపై శత్రుత్వంతోనే ఈ దాడికి పాల్పడి ఉంటారని, అయితే నిందితులెవరో తమకు ఇంకా తెలియడం లేదని పోలీసులు చెప్పారు. ఇంటికి బయటి నుంచి తాళం వేసి నిప్పు పెట్టారని, పూర్తి వివరాలను దర్యాప్తు తర్వాత వెల్లడిస్తామని తెలిపారు. తాము కొన్ని పేలుళ్లను కూడా విన్నామని స్థానికులు తెలిపారు. ఎమ్మెల్యే ప్రాతినిధ్యం వహిస్తున్న తాల్చేర్ మావోయిస్టు ప్రాబల్య ప్రాంతాల్లో ఒకటి. ఆయనను తనను పెళ్లి చేసుకుని మోసం చేశారని లలతేందు దాస్ అనే మహిళ ఇటీవల పోలీసులకు ఫిర్యాదు చేసింది. తాను ఆయనకు రెండో భార్యనని, అయితే ఆయన తనను భార్యగా లోకానికి పరిచయం చేయడం లేదని ఆరోపించారు.