బిడ్డను అమ్మి.. భార్య, భర్త తలోదారి చూసుకున్నారు - MicTv.in - Telugu News
mictv telugu

బిడ్డను అమ్మి.. భార్య, భర్త తలోదారి చూసుకున్నారు

October 13, 2020

nvncvn

కన్న బిడ్డను తల్లిదండ్రులు కంటి రెప్పలా కాచుకుంటారు. కానీ ఓ జంట మాత్రం బిడ్డను పొరుగువారికి అమ్మేసి భార్య, భర్త తలోదారి చూసుకున్నారు. తమ సంతోషం కోసం చేసిన ఆ పని అతడి పాలిట శాపంగా మారింది. ఒడిశాలోని మల్కన్‌గిరి జిల్లాలో ఈ వింత ఘటన వెలుగు చూసింది. 

మథిలి మండలం కియాంగ్ తేలగబేజా గ్రామంలో ఉండే ఓ జంట విడిపోవాలని అనుకున్నారు. కానీ అప్పటికే వారికి తొమ్మిదేళ్ల కొడుకు ఉండటంతో అదే గ్రామానికి చెందిన వారికి విక్రయించి వెళ్లిపోయారు. అప్పటి నుంచి అతడికి వేధింపులు మొదలయ్యాయి. కొనుక్కున్న కుటుంబం అతన్ని ప్రతి రోజూ పశువుల కాపలాకు పంపించే వారు. వినకపోతే చిత్ర హింసలకు గురిచేసే వారు. దీంతో వారి నుంచి తప్పించుకొని  సలపదర్ గ్రామానికి పారిపోయాడు. అక్కడ బాలుడు వాసుదేవ్ కథ విన్న గ్రామస్థులు అంగన్‌వాడీ కేంద్రానికి అప్పగించారు. దీనిపై కేసు నమోదు చేసి పోలీసులు విచారణ చేపట్టారు. అతన్ని బాలల సదనానికి పంపించారు.