తన భర్త పనిచేస్తున్న కాలేజీకి వెళ్లిన ఓ మహిళ.. నేరుగా అతను ఉన్న గదికి వెళ్లింది. ఆ గదిలో ఇంకెవరు లేరని గమనించి, వెంటనే తలుపేసింది. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా తన కాలుకి ఉన్న షూ ని తీసి ఆ గది చుట్టూ పరుగెత్తించి కొట్టింది. ఒడిశాలోని బెర్హంపూర్ యూనివర్సీటిలో షాకింగ్ ఘటన జరిగింది. ఆ యూనివర్శిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్న అనిల్ కుమార్ తిరియాగా.. ఏదో ఓ ఘనకార్యం చేశాడని సమాచారం. దీంతో శనివారం అతని భార్య అతను ఉన్న గదికి వెళ్లింది. డోర్ తీయగానే కోపంతో రెచ్చిపోయింది. వెంటనే చెప్పుతో కొట్టడం ప్రారంభించింది. దీంతో గదిలో అరుపులు, కేకల విన్పిస్తుండటంతో చుట్టుపక్కల వారు అక్కడికి వెళ్లి చూశారు. కొందరు ఆ ఘటనను ఫోన్ లో రికార్డు చేశారు.
ओडीशा की बरहामपुर यूनिवर्सिटी के असिस्टेंट प्रोफेसर की पत्नी ने चैम्बर बंद कर पति को चप्पलों से पीटा. pic.twitter.com/49JiV6ofXx
— UnSeen India (@USIndia_) August 21, 2022
శనివారం ఉదయం 11.30 గంటల సమయంలో ఈ సంఘటన జరిగిందని అక్కడి స్టూడెంట్లు చెబుతున్నారు. అనిల్ కుమార్ భార్య అతన్ని బండ బూతులు తిడుతూ.. “నువ్వేమైనా ఘనకార్యం చేశావనుకుంటున్నావా?” అంటూ రెచ్చిపోయింది. ఆపకుండా షూ తో కొడుతూనే ఉంది. కాసేపటి తర్వాత ఆ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆ దెబ్బలు తట్టుకోలేక షూలను తీసుకొని వాటిని బయటకు విసిరారు. వారిద్దరూ లోపల ఉన్నప్పుడు యూనివర్శిటీ సిబ్బంది తలుపు తీయమని కోరినా ఆమె పట్టించుకోలేదు. ఆ ప్రొఫెసర్‌ను రక్షించేందుకు సెక్యూరిటీ సిబ్బందిని తలుపులు కొట్టగా.. చాలాసేపటి తర్వాత ఆమె తలుపు తెరిచింది.
ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో పలువురు ఆ మహిళ ప్రవర్తనను ఖండిస్తూ ప్రశ్నిస్తున్నారు. తన భర్తపై ఇంత క్రూరత్వాన్ని ఎందుకు ప్రదర్శించిందో ఇంకా తెలియరాలేదు.