ప్రపంచవ్యాప్తంగా నేడు వినాయక చవితిని అందరూ ఎంతో భక్తి విశిష్టలతో జరుపుకుంటున్నారు. గణేశుడికి మంటపాలు కట్టి ప్రత్యేక పూజలు చేస్తున్నారు. వినాయకుడికి ఎంతో ఇష్టమైన పిండివంటలు చేసి ఆయనకు నైవేద్యంగా సమర్పిస్తున్నారు. ఇక.. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తో చేసిన విగ్రహాలు కాకుండా.. మట్టితో చేసిన వినాయకులనే ప్రతిష్ఠించాలని పర్యావరణ వేత్తలు చెబుతున్న నేపథ్యంలో.. చాలామంది మట్టివిగ్రహాలకే ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నారు.
Happy #GaneshChaturthi .My SandArt of Lord Ganesh by using 3,425 sand ladoos and Some Flowers at Puri beach in Odisha . pic.twitter.com/ruIOUDzaEj
— Sudarsan Pattnaik (@sudarsansand) August 31, 2022
ఇక ప్రముఖ సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్.. మరోసారి తన ప్రత్యేకతను నిరూపించుకున్నారు. గణేశ్ చతుర్థి సందర్భంగా ఒడిశాలోని పూరీ బీచ్లో 3,425 ఇసుక లడ్డూలతో వినాయకుని చిత్రాన్ని కలర్ఫుల్గా రూపొందించారు. రెండు ఏనుగులు గణేశునికి పూజ చేస్తున్నట్లు మట్టితో తయారుచేసిన ఈ చిత్రం అందరినీ ఆకట్టుకునేలా, ఆలోపించేసేలా ఉన్నది. హ్యాపీ గణేశ్ పూజ అని సందేశమిచ్చారు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ బదులు మట్టి వినాయకులనే పూజించాలని, పర్యావరణాన్ని కాపాడాలని కోరారు.