పారిపోయి లారీకింద పడి చచ్చిపోయిన రేపిస్ట్! - MicTv.in - Telugu News
mictv telugu

పారిపోయి లారీకింద పడి చచ్చిపోయిన రేపిస్ట్!

July 14, 2020

bbfcb

ఒడిశాలో ఘోరం జరిగింది. అత్యాచార కేసు నిందితుడు పోలీస్ స్టేషన్ నుంచి పారిపోయి లారీ కింద పడి మరణించాడు. ఈ సంఘటన రాష్ట్రంలోని రాయగడలో చోటుచేసుకుంది. ఇటీవల రాయగడ సమీపంలోని ఓ గ్రామంలో ఓ ఆగంతకుడు ఓ బాలికపై అత్యాచారం చేశాడు. దీంతో గ్రామస్తులు అతనికి దేహశుద్ది రాయగడ పోలీస్ స్టేషన్ లో అప్పగించారు. ఆ నిందితున్ని స్టేషన్ లో అప్పగించడానికి గ్రామస్తులు రెండు లారీల్లో రావడం గమనార్హం. 

ఆ యువకుడికి కఠిన శిక్ష పడేలా చేయాలని గ్రామస్తులు పోలీసులను కోరారు. దీంతో పోలీసులు ఆ యువకుడిని అరెస్ట్ చేసి బాధిత బాలికతో స్టేట్మెంట్ తీసుకున్నారు. తరువాత ఆమెను వైద్య పరీక్షల కోసం పంపించారు. స్టేషన్ లో పోలీసులు ఎవరిపనుల్లో వాళ్ళు ఉండగా ఆ అత్యాచార నిందితుడు ఒక్కసారిగా అక్కడి నుంచి బయటికి పరిగెత్తాడు. అతడి వెనకాలే పోలీసులు పరిగెత్తారు. మూల మలుపు వద్ద ఎదురుగా వస్తున్న లారీ ఆ నిందితుడిని ఢీ కొట్టింది. పోలీసులు అతడిని ఆస్పత్రికి తరలించేలోపే తుది శ్వాస విడిచాడు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.