ODISHA STATE TRANSPORT AUTHORITY DIFFERENT CAMPAIGN WITH OSCAR AWARD WINNING RRR NAATU NAATU SONG
mictv telugu

అస్కార్ గెలిచిన నాటు నాటు పాటతో ఒడిశా ప్రభుత్వం కొత్త ప్రచారం..వీడియో

March 13, 2023

అంతర్జాతీయ వేదికపై తెలుగోడి చిత్రం ఆర్ఆర్ఆర్ సత్తా చాటింది. అసాధ్యం అనుకున్న అస్కార్ అవార్డును నాటునాటు పాట సొంతం చేసుకుంది. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో అవార్డు సాధించడంతో దేశం మొత్తం సంబరపడిపోతోంది.ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలు వెలువెత్తుతున్నాయి. ఇదే సమయంలో నాటు నాటు పాటకు ఉన్న క్రేజ్‌ను ఒడిశా ప్రభుత్యం క్యాచ్ చేసుకొని వినూత్న ప్రచారానికి శ్రీకారం చుట్టింది. రోడ్డు ప్రమాదాలపై అవగాహన పరిచేందుకు ఒడిశా రవాణా శాఖ నాటు నాటు పాట ఆధారంగా క్యాంపెయిన్ ప్రారంభించింది. ప్రస్తుతం ఈ క్యాంపెయిన్ సోషల్ మీడియా ద్వారా ప్రజల్లోకి దూసుకుపోతుంది.

సాధారణంగా ఏదైనా ఫేమస్ అయినా సినిమా డైలాగ్, సాంగ్ వంటి వాటితో ప్రభుత్వాలు అవగాహనం పర్చడం కొత్తకాదు. గతంలో కూడా ఇలాంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు మరోసారి నాటునాటు పాటతో వాహనదారులకు అవగాహన పరిచే కార్యక్రమం చేపట్టింది ఒడిశా రవాణా శాఖ. మద్యం తాగి, మొబైల్ యూజ్ చేస్తూ, అతి వేగంతో ప్రయాణం చేయొద్దు సూచనలను నాటునాటు సాంగ్ ద్వారా చెప్పింది

“నో టు నో టు డ్రంక్ డ్రైవింగ్”, “నో టు నో టు మొబైల్ వైల్ డ్రైవింగ్”, “నో టు నో టు ఓవర్ స్పీడింగ్ ” అనే థీమ్‌లను విడుదల చేసింది. అదే విధంగా ఆర్ఆర్ఆర్ (RRR)అంటే రెస్పాన్సిబుల్ రోడ్ రైడ్స్ అంటూ అర్థం వచ్చేలా రాసుకొస్తూ ఎన్టీఆర్, రామచరణ్ డ్యాన్స్‌ వీడియో ట్విట్టర్ ద్వారాషేర్ చేసింది. ఈ ప్రచారానికి అనూహ్య స్పందన వస్తోంది.