ఆదర్శ వివాహం.. భర్తలేని కోడలుకు పెళ్లి చేసిన మామ - MicTv.in - Telugu News
mictv telugu

ఆదర్శ వివాహం.. భర్తలేని కోడలుకు పెళ్లి చేసిన మామ

September 19, 2019

Marriage..

ఒడిశాలోని మారుమూల ప్రాంతాల్లో వింత ఆచారాలు, పురషాధిక్య ఆలోచనలు కోకొల్లలు. అలాంటి వాటన్నింటిని పటాపంచలు చేశాడు ఓ వ్యక్తి. కొడుకు చనిపోవడంతో వితంతువుగా మారిన కోడలుకు ఆదర్శ వివాహం జరిపించాడు. తానే తండ్రిలా మారి ఆమెను మరో మెట్టినింటికి పంపించారు. మూఢ ఆచారాలకు పోకుండా నిండు మనసుతో ఆమె జీవితానికి చక్కటి దారి చూపించిన ఆ వ్యక్తిని అంతా అభినందిస్తున్నారు. 

నబరంగ్‌పుర్‌ జిల్లా ఎకోరిగావూన్‌ గ్రామానికి చెందిన కమల్‌ లోచన్‌ మఝీ కొడుకు  లలిత్ రోడ్డు ప్రమాదంలో మరణించాడు. అంతకు ముందే 2013లో నైనా అనే యువతితో వివాహం అయింది. పెళ్లైన ఏడాది తర్వాత అతను రోడ్డు ప్రమాదంలో మరణించాడు. కొడుకు మరణంతో అతని కోడలు ఒంటరిగా మారింది. చిన్న వయస్సులోనే భర్తను పోగొట్టుకొని ఒంటరిగా మారిన ఆమెకు మంచి జీవితం ప్రసాదించాలని అనుకున్నాడు. వెంటనే పెళ్లి సంబంధం కుదిర్చి తానే తండ్రిల రెండెకరాల పొలం కట్నంగా ఇచ్చాడు. పెళ్లైన ఏడాదికే ఆమెకు ఓ బిడ్డ కూడా పుట్టింది. తర్వాత ఆమె భర్త మరణించడంతో మామ మరో వివాహం జరిపించాడు.