చెయ్యి నరుక్కుని ఊరంతా తిరిగిన సమేశ్వరరెడ్డి  - MicTv.in - Telugu News
mictv telugu

చెయ్యి నరుక్కుని ఊరంతా తిరిగిన సమేశ్వరరెడ్డి 

May 23, 2020

Odisha Young Man Cut His Hand

అరచేయిని నరుక్కొని దాన్నికవర్లో చుట్టి ఊరంతా తిరిగాడు  ఓ వ్యక్తి. ఈ భయానక ఘటన ఒడిశాలోని రక్తం కారుతున్నా ఏ మాత్రం లెక్క చేయకుండా అలాగే రోడ్డుపైకి వచ్చాడు. గంజాం జిల్లా దిగపొహండి వద్ద చోటు చేసుకుంది. దీంతో అతన్ని చూసిన గ్రామస్తులంతా వణికిపోయారు.  వెంటనే స్థానికులు అతన్ని పట్టుకొని పోలీసులకు సమాచారం ఇచ్చారు. అతనికి ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. 

నరేంద్రపూర్‌ గ్రామంలో పి.సమేశ్వర రెడ్డి (20) అనే యువకుడు తన ఇంటి పెరట్లో ఉన్న పదునైన ఆయుధం తీసుకొని చేతిని మణికట్టు వరకు నరుక్కున్నాడు. దాన్ని తీసుకొని ఓ కవర్‌లో వేసుకున్నాడు. అయితే ఆ యువకుడి మానసిక పరిస్థితి బాగోలేదని అందుకే అలా చేసి ఉంటాడని గ్రామస్తులు చెబుతున్నారు. ప్రస్తుతం అతనికి చికత్స అందిస్తున్నారు. ఈ ఘటన జరిగినప్పటి నుంచి స్థానికులు భయాందోళనకు గురౌతున్నారు.