Odisha youth mischief in Ameerpet Metro railway station lift
mictv telugu

మెట్రో స్టేషన్‌లో బట్టలు విప్పి యువకుడి వికృత చేష్టలు

May 18, 2022

Odisha youth mischief in Ameerpet Metro railway station lift

హైదరాబాద్‌లోని అమీర్‌పేట్ మెట్రో స్టేషన్‌ లిఫ్టులో మహిళల ఎదుట అసభ్యంగా ప్రవర్తిస్తున్న ఓ యువకుడిని ఎస్సార్‌నగర్‌ పోలీసులు అరెస్టు చేశారు. రెండవ ఫ్లోర్‌లో మెట్రో ట్రైన్ ఎక్కుదామని, లిఫ్ట్ ఎక్కిన యువతిని.. ఆ వెనుకే ఫాలో అయిన ఓ వ్యక్తి .. లిఫ్ట్ లోనే అసభ్యంగా ప్రవర్తించాడు. బట్టలు విప్పి వికృత చేష్టలకు పాల్పడ్డాడు. ఎస్సాఆర్ నగర్ పీఎస్ ఇన్‌స్పెక్టర్‌ సైదులు తెలిపిన వివరాల ప్రకారం.. ఖైరతాబాద్‌కు చెందిన ఓ యువతి(23) మంగళవారం అమీర్‌పేటలో షాపింగ్‌ ముగించుకుని తిరిగి ఖైరతాబాద్‌ వెళ్లేందుకు అమీర్‌పేట మెట్రో స్టేషన్‌ లిఫ్ట్‌ ఎక్కింది.

అమె వెనకే లిఫ్ట్‌లోకి ప్రవేశించిన రాజు(19) అనే యువకుడు తన బట్టలు విప్పి, అసభ్యకర చేష్టలతో హడలెత్తించాడు. దీంతో లిఫ్ట్‌ నుంచి పరుగున బయటకొచ్చిన యువతి వెంటనే మెట్రో సిబ్బందికి ఈ విషయాన్ని తెలిపింది. దీంతో వారు రాజును పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఒడిశా రాష్ట్రానికి చెందిన రాజు రోజు మెట్రో స్టేషన్‌ లిఫ్ట్‌ వద్దే ఉంటూ ఒంటరిగా వెళ్లే మహిళల ముందు ఇదే తీరుగా అసభ్యంగా వ్యవహరిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. రాజును అరెస్టు చేసి రిమాండుకు తరలించారు.