odisha youth tied scooter and dragged for money
mictv telugu

అమానుషం.. అప్పు కట్టలేదని స్కూటీకి కట్టి లాక్కెళ్లారు.. వీడియో వైరల్

October 17, 2022

odisha youth tied scooter and dragged for money

మనుషులు రోజు రోజుకీ డబ్బు పట్ల ఎంత వ్యామోహం పెంచుకుంటున్నారనే దానికి అద్దం పట్టే వీడియో ఇది. అప్పు తిరిగి చెల్లించలేదనే కారణంతో స్నేహితుడి చేతులను తాళ్లతో బండికి కట్టి లాక్కెళ్లిన అమానుష సంఘటన ఒడిషా రాష్ట్రం కటక్ నగరంలో చోటుచేసుకుంది. ఇలా చాలా దూరం లాక్కెళ్లగా వెనుక నుంచి వస్తున్న ప్రయాణికులు ఈ మొత్తం తతంగాన్ని వీడియో తీయడంతో దారుణ ఘటన వెలుగు చూసింది.

యువకుడు స్నేహితుల వద్దే కొంత మొత్తం అప్పు తీసుకున్నాడని, ఎంత అడిగినా తిరిగి చెల్లించలేకపోవడంతో ఆదివారం రాత్రి ఇలా అమానుషంగా ప్రవర్తించారని తేలింది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసి ఇద్దరిని అరెస్ట్ చేశారు. అయితే ఇది చాలా సున్నితమైన కేసని, నిందితుల వివరాలు చెప్పేందుకు పోలీసులు నిరాకరించారు. అన్ని వివరాలను విచారణ పూర్తయ్యాక వెల్లడిస్తామని తెలిపారు. అయితే అక్షరాస్యత తక్కువ ఉన్న ఒడిషాలో గతంలో ఇలాంటి తరహా ఘటన వెలుగు చూసింది. మొబైల్ ఫోన్ చోరీ చేశాడనే నెపంతో ఓ యువకుడిని లారీ ముందు కట్టేసి మెడలో చెప్పుల దండ వేసి ఊరేగించారు.