బెజవాడ దుర్గమ్మకు తెలంగాణ బోనం సమర్పణ - MicTv.in - Telugu News
mictv telugu

బెజవాడ దుర్గమ్మకు తెలంగాణ బోనం సమర్పణ

July 4, 2022

ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మకు సోమవారం తెలంగాణ బోనం సమర్పించారు. ఆనవాయితీ ప్రకారం ప్రతీ ఏటా తెలంగాణ నుంచి బోనాలు సమర్పిస్తారు. అందులో భాగంగా హైదరాబాద్ మహంకాళి జాతర ,ఉమ్మడి దేవాలయ ఊరేగింపు కమిటీ ఆధ్వర్యంలో భారీ ఊరేగింపుతో వచ్చి బోనం సమర్పించారు. జోగిని విశా క్రాంతి బోనాన్ని తలపై మోశారు. ఈ కార్యక్రమంలో ఊరేగింపు కమిటీ చైర్మన్ రాకేష్ తివారీతో పాటు తెలంగాణ కళాకారులు పాల్గొన్నారు. కాగా, తెలంగాణలో బోనాల సీజన్ మొదలైన విషయం తెలిసిందే.