Office boy committed suicide in Minister Prashanth Reddy's camp office
mictv telugu

మంత్రి ప్రశాంత్‌రెడ్డి క్యాంపు కార్యాలయంలో ఆఫీస్‌ బాయ్‌ ఆత్మహత్య

August 28, 2022

నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండల కేంద్రంలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి నివాసంలో పని చేసే దేవేందర్(25) అనే యువకుడు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు . ఈ సంఘటన ఆదివారం ఉదయం వెలుగు చూసింది. వేల్పూర్ మండల కేంద్రానికి చెందిన దేవేందర్ గత కొంతకాలంగా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి నివాసంలో పనిచేస్తున్నాడు.

దేవేందర్ ఆత్మహత్యకు ప్రేమ వ్యవహారమే కారణమని చెబుతున్నారు. ఈ ఘటనపై ఆర్మూర్‌ ఏసీపీ మీడియాతో మాట్లాడారు. మృతిచెందిన యువకుడు ఓ మహిళతో సన్నిహితంగా మెలిగినట్లు ప్రాథమిక విచారణలో తెలిసిందని చెప్పారు. ఆత్మహత్యకు ముందు తాను చనిపోతున్నట్లు యువకుడు ఆమెకు మెసేజ్ చేసినట్లు తెలిపారు. దీనిపై పూర్తిస్థాయిలో దర్యాప్తు చేస్తామన్నారు. దేవేందర్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.