Officers demolished the wall of Ayyannapatrudu's house
mictv telugu

ఏపీలో బుల్డోజర్ పాలిటిక్స్.. అయ్యన్న పాత్రుడి ఇంటి గోడ..

June 20, 2022

Officers demolished the wall of Ayyannapatrudu's house

నిబంధనల పేరుతో టీడీపీ నాయకుడు అయ్యన్నపాత్రుడు ఇంటి గోడను అధికారులు కూల్చి వేశారు. దీంతో కూల్చివేతను ఆపాలని కోరుతూ ఆయన కుమారులు విజయ్, రాజేశ్‌లు ఆదివారం హైకోర్టులో కేసు వేశారు. విచారించిన న్యాయమూర్తి జస్టిస్ డి. రమేశ్.. కూల్చివేత ఆపాలని ఆదేశించారు. ఈ విషయాన్ని తక్షణం అధికారులకు తెలియజేయాలని ప్రభుత్వ న్యాయవాదికి సూచించింది.

అంతేకాక, రాత్రిపూట కూల్చివేతలపై విస్మయం వ్యక్తం చేశారు. ఘటనపై పూర్తి వివరాలు సమర్పించేందుకు సమయం కావాలని ప్రభుత్వం తరపు న్యాయవాది కోరడంతో విచారణను ఈ నెల 21కి వాయిదా వేశారు. అటు అయ్యన్నపాత్రుడి కుమారుడు విజయ్ సోమవారం ప్రభుత్వ వైఖరికి నిరసనగా దీక్ష చేస్తున్నారు. టీడీపీ ఛలో నర్సీపట్నం కార్యక్రమానికి పిలుపునివ్వడంతో పోలీసులు ఎక్కడికక్కడ నాయకులు, కార్యకర్తలను అడ్డుకుంటున్నారు.