శంషాబాద్‌ : పొట్టలో 11 కోట్ల కొకైన్‌తో దొరికిన ‘సాలె’ - MicTv.in - Telugu News
mictv telugu

శంషాబాద్‌ : పొట్టలో 11 కోట్ల కొకైన్‌తో దొరికిన ‘సాలె’

April 26, 2022

Officers seize cocaine at Shamshabad airport

శంషాబాద్ ఎయిర్‌పోర్టులో భారీ స్థాయిలో కొకైన్ పట్టుబడింది. దొరికిన కొకైన్ విలువ పదకొండున్నర కోట్లుంటుందని డీఆర్ఐ అధికారులు చెప్తున్నారు. వివరాలు.. టాంజానియాకు చెందిన ‘సాలె’ అనే వ్యక్తి దక్షిణాఫ్రికాలోని జోహెన్స్ బర్గ్ నుంచి దుబాయ్ మీదుగా శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి వచ్చాడు. అనుమానం వచ్చిన అధికారులు అతడిని తనిఖీ చేయగా, 22 కొకైన్ క్యాప్యూల్స్ బయటపడ్డాయి. దాంతో సాలెను అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో మళ్లీ అనుమానం రాగా, పొట్టలో దాచుకున్న 58 క్యాప్యూల్స్‌ను డాక్టర్ల సహాయంతో వెలికితీశారు. అన్నీ కలిపి ఒకటిన్నర కిలోల కొకైన్ స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ మార్కెట్‌లో పదకొండున్నర కోట్లుంటుందని అధికారులు తెలిపారు. అనంతరం నిందితుడిపై కేసు నమోదు చేసి రిమాండుకు తరలించారు. కాగా, ఇటీవల ఇంత పెద్ద మొత్తంలో కొకైన్ స్వాధీనం చేసుకోవడం ఇదే మొదటిసారి.