కడుపుకు ఏం తింటున్నాడో? పేదరైతు పంటను తొక్కించిన అధికారి - MicTv.in - Telugu News
mictv telugu

కడుపుకు ఏం తింటున్నాడో? పేదరైతు పంటను తొక్కించిన అధికారి

November 17, 2019

ధనిక రైతులతో లాలూచీ పడుతూ, వారి కనుసన్నల్లో నడుచుకునే అధికారులు పేద రైతుల విషయంలో మాత్రం అత్యంత దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారు. కాసింత పంటను అమ్ముకోడానికి మార్కెట్‌కు వచ్చిన పేదరైతుపై ఓ అధికారి గుండాయిజం ప్రదర్శించాడు. అనుమతి లేకుండా ఎలా అమ్ముతావంటూ అతని పంటను ట్రక్కుతో తొక్కించాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. 

ఉత్తరప్రదేశ్‌లోని హపూర్‌లో జరిగిందీ దారుణం. ప్రభుత్వ మార్కెట్‌కు ఓ రైతు పంట తెచ్చాడు. అయితే అతనికి అక్కడ అనుమతి లేది మార్కెట్ కార్యదర్శి సుశీల్ కుమార్ అడ్డుకున్నాడు. దీంతో రైతు తన పంటను పక్కకు తీసుకోబోయాడు.కానీ సుశీల్ రెచ్చిపోయాడు. తన డ్రైవర్‌ను, ఎస్‌యూవీ వాహనాన్ని పిలింపించాడు. ఆ బండిని పేదరైతు పంటపై పోనిచ్చాడు. ముందుకు, వెనక్కి నడపడంతో పంట నుజ్జునుజ్జయింది. ఈ దుర్మార్గాన్ని అక్కడి అధికారులు చూస్తూ ఉన్నారేగాని, ఒక్కరూ అడ్డుకోలేకపోయారు.