అర్థరాత్రి ఆటోలో ఈవీఎంలు... జగిత్యాలలో కలకలం - MicTv.in - Telugu News
mictv telugu

అర్థరాత్రి ఆటోలో ఈవీఎంలు… జగిత్యాలలో కలకలం

April 16, 2019

ఓవైపు ఈవీఎంలు, వీవీప్యాట్‌లపై జాతీయ స్థాయిలో చర్చ జరుతున్న తరుణంలో జగిత్యాలలో ఇటీవల చోటు చేసుకున్న సంఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. ఏప్రిల్ 11న ఎన్నికలు ముగిసిన సంగతి తెలిసిందే. కాగా, ఎన్నికలు ముగిసిన మూడురోజుల తరువాత, అనగా..ఏప్రిల్ 15 సోమవారం రాత్రి సమయంలో ఆటోలో ఈవీఎంలను తరలించడం చర్చనీయాంశంగా మారింది.

Officials carry evms in auto in jagtial district Telangana.

జగిత్యాల తహసీల్దారు కార్యాలయం నుంచి మినీ స్టేడియంలో ఉన్న గోదాంకు 10 ఈవీఎంలను ఆటోలో తరలించారు. గోదాంకు తాళం వేసి ఉండటంతో వాటిని తిరిగి తహసీల్దార్ కార్యాలయానికి తరలించారు. ఈ వ్యవహారం ఇప్పుడు జగిత్యాలలో చర్చనీయాంశంగా మారింది. అయితే, అధికారులు మాత్రం డెమో కోసం ఉపయోగించిన ఈవీఎంలను మాత్రమే ఆటోలో గోదాంకు తరలించినట్టు చెబుతున్నారు. ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన జగిత్యాల జిల్లా కలెక్టర్‌.. విచారణకు ఆదేశించినట్టు సమాచారం.