Officials have removed the statue of YS in ippatam village
mictv telugu

ఇప్పటంలో వైఎస్ విగ్రహం తొలగించిన అధికారులు

November 7, 2022

Officials have removed the statue of YS in ippatam village

ఏపీలోని ఇప్పటం గ్రామంలో రోడ్డు విస్తరణ పనులు రాజకీయంగా దుమారం రేపిన విషయం తెలిసిందే. 120 అడుగుల మేర రోడ్డు విస్తరణ పేరుతో ప్రభుత్వం సుమారు 52 ఇళ్లను కూల్చి వేసింది. ఈ నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇప్పటం గ్రామంలో పర్యటించి బాధితులను పరామర్శించారు. రోడ్డు విస్తరణలో భాగంగా అధికారులు గాంధీ, అంబేద్కర్, నెహ్రూ, ఇందిరా గాంధీ, అబ్దుల్ కలాం విగ్రహాలను తొలగించారు.

కానీ, వైఎస్ విగ్రహం ఎందుకు తొలగించలేదని ఆయన ప్రశ్నించారు. పైగా పవన్ పర్యటనలో పోలీసులు వైఎస్ విగ్రహానికి రెండంచెల ముళ్ల కంచెతో భద్రత కల్పించి భారీగా పోలీసులు మొహరించారు. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో స్పందించిన ప్రభుత్వం సోమవారం క్రేన్ సాయంతో వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహాన్ని తొలగించి వేరే చోటుకి తరలించింది. కాగా, మంగళగిరి – తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ డెవలప్ మెంట్ కోసం రోడ్డు విస్తరణ చేపట్టామంటూ ప్రభుత్వం చెప్తోంది. కానీ, జనసేన ఆవిర్భావ సభకు స్థలం ఇచ్చారనే కక్షతోటే ప్రభుత్వం ఈ దుశ్చర్యకు పాల్పడిందని జనసైనికులు ఆరోపించారు.