Officials have seized a wine shop selling fake liquor in Pebber
mictv telugu

తెలంగాణ : వైన్ షాపులో నకిలీ మద్యం.. భయంలో మందుబాబులు

August 27, 2022

Officials have seized a wine shop selling fake liquor in Pebber

నకిలీ మద్యం అమ్ముతున్న ఓ వైన్ షాపును ఎక్సైజ్ అధికారులు సీచ్ చేశారు. వనపర్తి జిల్లా పెబ్బేరు మండల కేంద్రంలో ఉన్న సదరు వైన్ షాపులో నకిలీ మద్యం అమ్ముతున్నారనే సమచారం అధికారులకు అందింది. దీంతో ఆగస్టు 22న వైన్ షాపుపై ఎక్సైజ్ అధికారులు దాడి చేసి మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు.

పరిశీలన అనంతరం నకిలీదని తేలడంతో వైన్ షాపును సీజ్ చేశారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు కేసు నమోదు చేసి షాపును సీజ్ చేసినట్టు ఎస్సై తెలిపారు. ఇంకెవరైనా నకిలీ మద్యం అమ్మితే ఉపేక్షించమని, చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అయితే ఆ షాపులో మద్యం తాగిన వారు మాత్రం ఆందోళన చెందుతున్నారు. నకిలీ మద్యం తాగిన తమకు ఏమవుతుందోననే ఆందోళన మందుబాబుల్లో కనిపిస్తోంది.