Officials removed the wall at Pullareddys residence
mictv telugu

పుల్లారెడ్డి కుటుంబానికి షాక్.. అడ్డుగోడను తొలిగించిన అధికారులు

July 19, 2022

హైదరాబాద్ లో ప్రముఖ పారిశ్రామిక వేత్తగా పేరున్న స్వీట్ షాప్ ఓనర్ పుల్లారెడ్డి కుటుంబానికి షాక్ తగిలింది. పుల్లారెడ్డి కొడుకైన రాఘవరెడ్డి కోడలును ఇంటిలోకి రాకుండా కట్టిన అడ్డుగోడ ను ఆధికారులు కూల్చి వేశారు. పుల్లారెడ్డి కుమారుడైన రాఘవరెడ్డి కోడలు ప్రజ్ఞారెడ్డి.. తనను ఇంట్లో తిరగనివ్వకుండా గోడ కట్టారని కోర్టులో పిటిషన్ వేశారు. ఈ వ్యాజ్యంపై విచారించిన న్యాయస్థానం.. గోడను కూలగొట్టాలని ఆదేశించింది. ఈ మేరకు ఇంటికి చేరుకున్న ప్రొటెక్షన్‌ అధికారి అక్కేశ్వర్‌రావు పంజగుట్ట పోలీసుల సహకారం తీసుకుని అడ్డుగా ఉన్న గోడను తీయించారు.

పుల్లారెడ్డి మనవడు ఏక్‌నాథ్‌రెడ్డితో బెంగుళూరు కి చెందిన ప్రజ్ఞారెడ్డితో వివాహం జరిగింది. తనను అదనపు కట్నం కోసం వేధిస్తున్నారని, భర్త ఏక్‌నాథ్‌రెడ్డి, అత్తమామలపై ప్రజ్ఞారెడ్డి ఆరోపణలు చేశారు. కోడలిపై కోపంతో ఆమె గది తలుపు దగ్గర రాత్రికిరాత్రి అత్తామామలు గోడకట్టారు. తనను ఇంట్లోకి రానివ్వడం లేదని ప్రజ్ఞారెడ్డి కోర్టును ఆశ్రయించారు. దీంతో ఏక్‌నాథ్ రెడ్డితోపాటు కుటుంబ సభ్యులకు వ్యతిరేకంగా 4వ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. కోడలు ప్రజ్ఞారెడ్డిని ఇంట్లోకి రానిచ్చేలా చూడాలని, ఆమెకు రక్షణ కల్పించాలని పంజాగుట్ట పోలీసులకు ఆదేశాలిచ్చింది. తాను ఆస్తి కోసం పిటిషన్ వేయలేదని, తన హక్కుల కోసం పోరాటం చేస్తున్నా అంటోంది ప్రజ్ఞారెడ్డి. గోడను తొలగించిన ప్రొటెక్షన్‌ అధికారులకు ఆమె ధన్యవాదాలు తెలిపారు. రెండు నెలలుగా తాను తన పాప కిందకు, పైకి వెళ్లేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నామని తెలిపారు.