వేములవాడకు హెలికాప్టర్.. శివరాత్రికి స్పెషల్ సేవలు - MicTv.in - Telugu News
mictv telugu

వేములవాడకు హెలికాప్టర్.. శివరాత్రికి స్పెషల్ సేవలు

February 17, 2020

Vemulawada.

రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడలోని పుణ్యక్షేత్రమైన రాజరాజేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పెద్ద సంఖ్యలో వస్తారనే విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో భక్తుల వెసలుబాటు కొరకు రాష్ట్ర ప్రభుత్వం హెలికాప్టర్ సర్వీసులను ప్రారంభించనుంది. త్వరలో రానున్న శివరాత్రి పర్వదినం సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో హాజరు అవుతారు. వాళ్ళను దృష్టిలో పెట్టుకుని హెలికాప్టర్ సర్వీసులను ప్రారంభించాలని ప్రభుత్వం యోచిస్తోంది.

ఈ విషయమై పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. ‘వేములవాడలో శివరాత్రి జాతరకు కోటి రూపాయలు ఇస్తున్నాం. ఎలాంటి లోటుపాట్లు లేకుండా వేడుకలను వైభవంగా నిర్వహిస్తాం. హైదరాబాద్ నుంచి వేములవాడకు ప్రత్యేక ప్యాకేజీల్లో హెలికాప్టర్ సేవలు అందించనున్నాం’ అని వెల్లడించారు. ఇదిలావుండగా రాష్ట్ర పర్యాటక శాఖ కూడా వేములవాడకు ప్రత్యేక బస్సులను నడపబోతోంది. హైదరాబాద్ నుంచి వేములవాడకు ఈ బస్సులు నడుస్తాయి.