Officials who did not follow protocol during Governor Tamilisai Komuravelli's visit
mictv telugu

గవర్నర్‌కు మళ్లీ అవమానం.. పట్టించుకోని ఉన్నతాధికారులు

November 10, 2022

Officials who did not follow protocol during Governor Tamilisai Komuravelli's visit

తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, రాష్ట్ర ప్రభుత్వం మధ్య విభేదాలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. కౌశిక్ రెడ్డి ఎమ్మెల్సీగా నియామకం నుంచి ప్రారంభమైన ఈ గొడవ.. నిన్నటి యూనివర్సిటీ బిల్లు వరకు కొనసాగుతూనే వస్తోంది. ఈ నేపథ్యంలో గవర్నర్ ఎక్కడికి వెళ్లినా అక్కడి అధికారులు ఆమెను అస్సలు పట్టించుకోవడం లేదు. మేడారం జాతర, భద్రాచలం పర్యటన వంటి సందర్భాలలో గవర్నర్ కోరినా గగనతల రవాణా సౌకర్యం కల్పించలేదు.

పోనీ రోడ్డు మార్గం ద్వారా వెళ్ళినా అక్కడి జిల్లా అధికారులు ప్రోటోకాల్ ప్రకారం ఆమెను రిసీవ్ చేసుకోవడానికి రాలేదు. ఈ విషయంపై తమిళిసై తన అసంతృప్తిని వ్యక్తం చేశారు కూడా. తాజాగా సిద్ధిపేట జిల్లాలో తమిళిసైకి మళ్లీ అవమానం జరిగింది. గురువారం ఆమె కొమురవెల్లి మల్లన్న దర్శనానికి వెళ్లగా.. జిల్లా కలెక్టర్, ఎస్పీలు ఏమాత్రం పట్టించుకోలేదు. కనీసం స్వాగతం పలికేందుకు కూడా రాలేదు. డీఆర్వో, ఆలయ అర్చకులు గవర్నర్‌కు స్వాగతం పలికారు. దర్శనం అనంతరం దూల్మిట్ట మండలం బైరాన్ పల్లి గ్రామానికి వెళ్లారు. ఈ ఘటనతో ప్రోటోకాల్ అంశం మళ్లీ చర్చనీయాంశమైంది.