Oh the irony LOL: Elon Musk reacts after Twitter sues him for abandoning $44 billion buyout
mictv telugu

కోర్టుకెళ్తానన్న ట్విట్టర్.. ఎలన్ మస్క్‌ సెటైరికల్ పోస్ట్ వైరల్

July 13, 2022

షేరుకు 54.20 డాలర్లు చెల్లించి మరీ ట్విట్టర్ ను కొనుగోలు చేస్తానంటూ ప్రకటించిన .. టెస్లా అధినేత ఎలన్ మస్క్ వెనక్కి తగ్గారు. ట్విట్టర్ ను కొనుగోలు చేయడం లేదని, ట్విట్టర్‌తో కుదుర్చుకున్న 44బిలియన్ డాలర్ల ఒప్పందాన్ని రద్దు చేసుకుంటున్నట్లు ప్రకటించేశారు. దీంతో ఎలాన్ మస్క్ కు వ్యతిరేకంగా ట్విట్టర్ యాజమాన్యం డెలావేర్ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. మస్క్ ప్రకటించినట్టుగానే ఒక్కో ట్విట్టర్ షేరును 54.20 డాలర్లకు కొనుగోలు చేసేలా ఆదేశాలు ఇవ్వాలని కోరింది.
దీనిపై మస్క్ స్పందిస్తూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు. “మొదట వాళ్లు నేను ట్విట్టర్ కొనలేనని అన్నారు. తర్వాత బాట్ ఇన్ఫర్మేషన్ చెప్పడం కుదరన్నారు. ఇప్పుడు కోర్టుకెళ్లి నాతో బలవంతంగా ట్విట్టర్ కొనిపిస్తానంటున్నారు. బోట్ సమాచారాన్ని కోర్టులో బహిర్గతంలో చేయాల్సి ఉంటుందని” తన ఫోటోలతో ఓ పోస్ట్ చేశారు. ఎలన్ మస్క్ చేసిన ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ట్విట్టర్ ను కొనుగోలు చేయాలనుకున్న ఎలన్ మస్క్ ఫేక్ అకౌంట్ల సమాచారం(బాట్ సమాచారం) ఇవ్వాలని కోరారు. అయితే ట్విట్టర్ ఆ వివరాలు ఇచ్చేందుకు నిరాకరించింది. దీంతో మస్క్ డీల్ ను రద్దు చేసుకుంటున్నట్లు ప్రకటించాడు. మస్క్ ట్విట్టర్ కొనుగోలు రద్దు అంశంపై ట్విట్టర్ చైర్మన్ బ్రెట్ టైలర్ స్పందించారు. నిర్ణయించిన ధరకు ట్విట్టర్ ఒప్పందాన్ని పూర్తి చేసేందుకు బోర్డు కట్టుబడి ఉందని చెప్పారు. మస్క్ నిర్ణయంపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.