యువతిని తుపాకీతో కాల్చిన కుక్క! - MicTv.in - Telugu News
mictv telugu

యువతిని తుపాకీతో కాల్చిన కుక్క!

October 9, 2019

అదృష్టం అడ్డం తిరిగితే అరటిపండు తిన్నా పన్ను విరుగుద్దంటారు. ఈ సామెతకు సరిగ్గా సరిపోయే సంఘటన ఇటీవల అమెరికాలో చోటుచేసుకుంది. ఓక్లహామా రాష్ట్రానికి చెందిన టీనా స్ప్రింగర్  అనే యువతి గురువారం కారులో ప్రయాణిస్తుండగా తనతో తెచ్చుకున్న గన్నును డాష్ బోర్డులో పెట్టింది. వెనుక సీట్లో బ్రెంట్ స్పార్క్స్ అనే మరో వ్యక్తి కూర్చున్నాడు. 

dog ..

అతడు తన పెంపుడు కుక్కను వెంట తెచ్చుకున్నాడు. కారు రైల్వే క్రాసింగ్ వద్దకు చేరుకోగా వాళ్లు కారు ఆపారు. అప్పుడు రైలు పెద్ద శబ్దం చేసుకుంటూ కారు ముందునుంచి వెళ్లింది. దీంతో కారులోని కుక్కపిల్ల భయపడిపోయి..ఒక్కసారిగా ముందు సీట్లోకి దూకింది. ఈ క్రమంలో కుక్క కాలు గన్నుపై పడింది. దీంతో ప్రమాదవశాత్తూ గన్నుపేలి టీనా శరీరంలోకి మూడు బుల్లెట్లు దూసుకుపోయాయి. వెంటనే బ్రెంట్ స్పార్క్స్.. అంబులెన్సుకు సమాచారం అందించాడు. ఘటనా స్థలానికి చేరుకున్న సిబ్బంది ఆమెను ఆసుపత్రికి తరలించారు. టీనా ప్రస్తుతం కోలుకుంటున్నట్టు డాక్టర్లు తెలిపారు.