అమిత్ షా తర్వాత మరో కేంద్రమంత్రికి కరోనా - MicTv.in - Telugu News
mictv telugu

అమిత్ షా తర్వాత మరో కేంద్రమంత్రికి కరోనా

August 4, 2020

Oil Minister Dharmendra Pradhan tests positive for coronavirus

దేశంలో రోజురోజుకు రెచ్చిపోతున్న తనను ప్రజాప్రతినిధులు అదుపు చేసే ప్రయత్నాలు చేస్తున్నారని వారిని ఆవహిస్తున్నట్టుంది కరోనా మహమ్మారి. మొన్నటికి మొన్న కేంద్ర హోంశాఖామంత్రి అమిత్ షాకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిన విషయం తెలిసిందే. తాజాగా మరో కేంద్రమంత్రికి కరోనా సోకింది. దీంతో అధికారంలో ఉన్న బీజేపీలో కరోనా తీవ్ర కలకలం రేపుతోంది. తాజాగా కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ప్రస్తుతం ఆయన గురుగ్రామ్‌లోని మేదాంత ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు.

ఇటీవల ఆయన కార్యాలయంలో పనిచేసే ఓ ఉద్యోగికి కరోనా సోకింది. దీంతో గత కొన్ని రోజులుగా ధర్మేంద్ర క్వారంటైన్‌లో ఉంటున్నారు. గత బుధవారం జరిగిన కేబినెట్ సమావేశానికి కూడా ఆయన హాజరుకాలేదు. అయితే రెండు రోజులుగా కరోనా లక్షణాలు కనిపించడంతో కరోనా పరీక్షలు చేయించుకున్నారు. పరీక్షల్లో కరోనా పాజిటివ్‌గా తేలింది. వైద్యుల సలహా మేరకు ఆసుపత్రిలో చేరారు. కాగా, అమిత్ షా కూడా మేదాంత ఆసుపత్రిలోనే చికిత్స పొందుతున్నారు. ఇప్పటికే మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్, కర్నాటక ముఖ్యమంత్రి యడియూరప్పకు కరోనా సోకిన విషయం తెలిసిందే.