Oil tanker flips on national highway palnadu Andhra Pradesh
mictv telugu

పల్నాడులో ఆయిల్ ట్యాంకర్ బోల్తా.. డబ్బాలతో జనం..

July 20, 2022

ఆయిల్ ట్యాంకర్ బోల్తా పడ్డంతో జనం పండుగ చేసుకున్నారు. డబ్బాలు, బకెట్లతో పరుగుపరుగునా వచ్చి అందిన కాడికి తోడుకుని వెళ్లిపోయారు. ఏపీలోని పల్నాడు జిల్లా నకరికల్లు మండలం చల్లగుండ్లలో బుధవారం ఈ సంఘటన చోటుచేసుకుంది. చెన్నై నుంచి హైదరాబాద్‌కు ఆయిల్ లోడుతో వెళ్తున్న ట్యాంకర్ అదుపు తప్పి బోల్తా పడింది. విషయం తెలుసుకున్న చుట్టుపక్కల గ్రామాల జనం చేతికి దొరికి బొచ్చెబోలెలతో అక్కడికి చేరుకుని అందినకాడికి నింపుకున్నారు. జనం భారీ సంఖ్యలో గుమికూడడంతో జాతీయ రహదారిపై వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బంది కలిగింది. పోలీసులు క్రేన్ సాయంతో ట్యాంకర్‌ను రోడ్డు పక్కకు జరిపారు. జనం ఆయిల్ తోడుకుంటున్న దృశ్యాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.