ఓకే వీధి.. రెండు జిల్లాలు - MicTv.in - Telugu News
mictv telugu

ఓకే వీధి.. రెండు జిల్లాలు

April 5, 2022

bgnbgn

ఆంధ్రప్రదేశ్‌లో కొత్త జిల్లాల ఏర్పాటుపై సోమవారం జగన్ మోహన్ రెడ్డి కార్లిటీ ఇచ్చిన విషయం తెలిసిందే. తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్‌గా కొత్త జిల్లాలను ఆయన ప్రారంభించారు. 13 జిల్లాలుగా ఉన్న ఏపీ.. 26 జిల్లాలుగా ఏర్పడింది. అంతేకాకుండా నూతన జిల్లాల్లో పరిపాలన కూడా ప్రారంభమైంది.

అయితే, ఓ వీధి మాత్రం రెండు జిల్లాలకు వారిధిగా నిలిచింది. వీధిలోని కుడివైపున వీధి ఒక జిల్లా పరిధిలోకి, ఎడమవైపున ఉన్న వీధి మరోక జిల్లా పరిధిలోకి వెళ్లిన ఘటన సంచలనంగా మారింది. రెండు మండలాలు, రెండు నియోజకవర్గాలే కాదు, రెండు వేర్వేరు జిల్లాలకు సరిహద్దుగా కొవ్వూరు నియోజకవర్గంలోని తాళ్లపూడి మండలంలోని తాడిపూడి, పోలవరం నియోజకవర్గంలోని గూటాల పంచాయతీ పరిధిలోని మహాలక్ష్మి దేవి పేట గ్రామాలు వేర్వేరు జిల్లాల పరిధిలోకి వెళ్లాయి. ఒకే వీధిలో కుడివైపున ఉన్న తాడిపూడి తూర్పుగోదావరి జిల్లా పరిధిలోకి మారగా, ఎడమ వైపున ఉన్న మహాలక్ష్మి దేవి పేట ఏలూరు జిల్లాలోకి వెళ్లింది.