Okaya EV launches its e-scooter Faast F2F in India: Here’s price, range, more
mictv telugu

ఒకాయా నుంచి సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్!

February 21, 2023

Okaya EV launches its e-scooter Faast F2F in India: Here’s price, range, more

ఒకాయా ఫాస్ట్ ఎఫ్2ఎఫ్ ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్ చేసింది. బడ్జెట్ రేంజ్ లో ఉన్న ఈ వెహికిల్ ని ఒకసారి ఛార్జ్ చేస్తే 80 కిలోమీటర్ల మేర వెళ్లిపోవచ్చు.
ఒకాయా ఈవీ (Okaya EV) సంస్థ మరో ఎలక్ట్రిక్ స్కూటర్ ను తీసుకొచ్చింది. Okaya Faast F2F పేరుతో బడ్జెట్ రేంజ్ లో ఉంది. ఒక్కసారి చార్జ్ చేస్తే 70 నుంచి 80 కిలోమీటర్ల వరకు ప్రయాణించొచ్చు. దీని వివరాలు మీకోసం..

బ్యాటరీ.. డ్రైవింగ్ మోడ్స్..

ఒకాయా ఫాస్ట్ ఎఫ్2ఎఫ్ 2.2 కిలో వాట్ హవర్ (60V36Ah) లిథియమ్ అయాన్ బ్యాటరీని కలిగి ఉంది. బ్యాటరీ నాలుగు నుంచి ఐదు గంటల్లో ఫుల్ ఛార్జ్ అవుతుంది. 800 వాట్స్ బీఎల్డీసీ మోటర్ ఉంటుంది. దీనికి రెండు సంవత్సరాల వారంటీ కూడా ఉంది. ఇక ఈ స్కూటర్ స్పీడ్ గంటకు 55 కిలోమీటర్లు. అంతేకాదు.. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ మూడు డ్రైవింగ్ మోడ్స్ తో వస్తున్నది. ఎకో, సిటీ, స్పోర్ట్స్ మోడ్స్ తో ఉంటాయి.

ఫీచర్లు.. ధర..

ఫుల్లీ డిజిటల్ ఇనుస్ట్రుమెంటల్ క్లస్టర్, రిమోట్ కీ, డీఆర్ఎల్ హెడ్ ల్యాంప్స్, ఎడ్జీ టైల్ ల్యాంప్ లను ఈ స్కూటర్ కలిగి ఉంది. టెలిస్కోపిక్ ఫ్రంట్ సస్పెన్షన్, స్ప్రింగ్ లోడెడ్ హైడ్రాలిక్ రేర్ షాక్ అబ్జార్బర్లను ఈ స్కూటర్ సొంతం. ఇక ఈ స్కూటర్ ధర రూ.83,999(ఎక్స్ షోరూమ్)గా ఉంది. మెటాలిక్ బ్లాక్, మెటాలిక్ సియాన్, మెటాలిక్ గ్రీన్, మెటాలిక్ గ్రే, మెటాలిక్ సిల్వర్, మెటాలిక్ వైట్ కలర్ ఆప్షన్ లలో ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ అందుబాటులో ఉంది. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని ఒకాయా షోరూమ్స్ ల్లో ఈ స్కూటర్స్ ని కొనుగోలు చేయవచ్చు.