ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్లు వచ్చేస్తున్నాయ్.. - MicTv.in - Telugu News
mictv telugu

ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్లు వచ్చేస్తున్నాయ్..

April 23, 2021

Ola electric Scooters coming soon

చమురు ధరలు పెరగడంతో వాహనదారులు ప్రత్యామ్నాయ వాహనాలపై దృష్టి సారించారు. ఇవి పర్యావరణ పరిరక్షణకూ దోహదపడుతున్నాయి. ప్రభుత్వాలు కూడా సబ్సిడీ ఇస్తుండడంతో విద్యుత్ కార్లకు డిమాండ్ పెరుగుతోంది. ఎలక్ట్రిక్ ద్విచక్రవాహనాలు కూడా పెద్దసంఖ్యలో రోడ్లెక్కుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రముఖ ట్యాక్సీ సేవల సంస్థ ఓలా కూడా స్కూటర్లను తీసుకొస్తోంది.ఈ ఏడాది జూలైలో భారతీయ మార్కెట్లోకి తమ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను తీసుకొస్తామని కంపెనీ చైర్మన్ భవీష్ అగర్వాల్ తెలిపారు.
అత్యాధునిక ఫీచర్లు ఉండే తమ స్కూటర్లకు రోడ్లలోనూ చార్జింగ్ పాయింట్లు ఏర్పాటు చేస్తామని వెల్లడించింది.400 నగరాల్లో లక్షకుపైగా చార్జింగ్‌ పాయింట్లతో ఉంటాయని ఆయన వెల్లడించారు. మొదట తమ ఫ్యాక్టరీలో లక్ష యూనిట్లను తయారు చేస్తామని తర్వాత ఉత్పత్తిని 20 లక్షల యూనిట్లకు పెంచుతామని చెప్పారు స్కూటర్లను జాలై నుంచి అమ్ముతామన్న ఆయన ఎలక్ట్రిక్‌ వాహనాలకు చార్జింగ్‌ నెట్‌వర్క్‌ కీలకమని పేర్కొన్నారు. తమ చార్జింగ్ పాయింట్లలో స్కూటర్ బ్యాటరీని 18 నిమిషాల్లో 50 చార్జింగ్‌ చేసుకోవచ్చని, అది 75 కి.మీ. దూరం ప్రయాణానికి వెళ్లడానికి సరిపోతుందని చెప్పారు. మాల్స్, ఐటీ పార్కులు, ఆఫీస్‌ కాంప్లెక్సులు, కెఫేలు వద్ద ఓలా చార్జింగ్ పాయింట్లు ఉంటాయన్నారు.