ఓలా వేటు.. వందలాది ఉద్యోగులు ఇంటికి - MicTv.in - Telugu News
mictv telugu

ఓలా వేటు.. వందలాది ఉద్యోగులు ఇంటికి

November 29, 2019

Ola ...

ప్రైవేట్ క్యాబ్ వ్యవస్థలో ఓలా కంపెనీ వినియోగదారులను ఆకట్టుకుంటోంది.  పలు విభాగాల్లో 6వేల మందికి ఉపాధి కల్పిస్తోంది. నిర్వహణ లోపాలు, ఆర్థిక మాంద్యం తదితర కారణాల వల్ల  ఓలా సంచలన నిర్ణయం తీసుకుంది. 8 నుంచి 10 శాతం మంది ఉద్యోగులను తీసేయాలని నిర్ణయించుకుంది. ఇనిషియల్ పబ్లిక్ ఆఫర్(ఐపీఓ) కింద 10 శాతం మందికి ఉద్వాసన పలుకుతున్నట్లు ఆంగ్ల మీడియాలో వార్తలు వస్తున్నాయి. దాదాపు 350 మందిని తీసేస్తున్నట్లు సమాచారం. 

ఓలా అధికార ప్రతినిధి ఒకరు మాట్లాడుతూ.. ‘సంస్థాగతమైన డిజైన్‌ను మార్చడానికి తీసుకునే నిర్ణయాలు ఉద్యోగుల్లో నైపుణ్యాన్ని, వ్యాపారంలో లావాదేవీలను పెంచుతాయి. ఈ మార్పులతో ప్రపంచవ్యాప్తంగా వ్యాపారాన్ని విస్తరించాలని చూస్తున్నాం. ఓలా సంస్థ 2019లో రూ. 1,160కోట్ల నష్టాన్ని, 2018లో 2వేల 676కోట్ల నష్టాన్ని చవిచూసింది. ఒకవేళ ఉద్యోగుల్ని తొలగిస్తే రూ.1,885కోట్ల లాభాలు వస్తాయని సంస్థ భావిస్తోంది. పెట్టుబడిదారుల ఒత్తిడి కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నాం’ అని ఆయన వెల్లడించారు.