స్పెషల్ ఎడిషన్ పేర్లతో కొన్ని వస్తువులను చాలా తక్కువ సంఖ్యలో ఉత్పత్తి చేస్తుంటాయి కంపెనీలు. అవి తమ దగ్గరుంటే మరింత లగ్జరీగా ఉంటుందని కోటీశ్వరులు కోట్లు ధారపోసి కొంటుంటారు. అయితే ఎంత డబ్బున్నా కొన్ని దక్కవు. ఓలా కంపెనీ తయారు చేసిన రంగురంగులు హోళీ స్కూటర్లు అలాంటివే. హోళీ సందర్భంగా ఈ హోళీ స్కూటర్లను కేవలం ఐదింటినే తయారు చేశారు. వీటిని దక్కించుకోవాలంటే ఫొటోల పోటీలో పాల్గొనాల్సి ఉంటుంది. ఎస్ 1 ఎలక్ట్రిక్ స్కూటర్ శ్రేణిలో వీటిని తయారు చేశామని కంపెనీ ఈసీఓ భవీస్ అగర్వాల్ తెలిపారు. ఈ స్కూటర్ల ఫొటోలను సోషల్ మీడియాతో పంచుకున్నారు. పోటీలో పాల్గొనే ఔత్సాహికులు ఇప్పటికే మార్కెట్లో ఉన ఓలా స్కూటర్ ఎస్ 1ను పక్కనబెట్టుకుని హోళీ సంబరాలు జరుపుకుంటూ తీసిన ఫొటోలను ఓలా సోషల్ మీడియా అకౌంట్లలో పోస్టాలి. ఆ ఫొటోల్లో చక్కగా ఉన్న ఐదింటిని ఎంపిక చేసి రంగుల బండ్లను వారికి అందజేస్తారు.