చెల్లని నాణేనికి కోటిన్నర - MicTv.in - Telugu News
mictv telugu

చెల్లని నాణేనికి కోటిన్నర

August 21, 2017

ప్రతి కుక్కకూ ఓ రోజు వస్తుందన్నట్లు ప్రతి నాణేనికి ఇప్పుడు కాకపోయినా ఎప్పుడో ఒకప్పుడు మాంచి బేరం వచ్చితీరుతుంది. పాత సామాన్లలో ఎక్కడో అడుగున పడున్న ఓ పాతకాలం నాటి నాణెం ఇప్పుడు కోట్ల ధర పలుకుతోంది. పంజాబ్ లోని సిర్సా జిల్లా దబ్వాలీ గ్రామానికి చెందిన గౌరీ శంకర్ కు అదృష్టం ఓ నాణెం రూపంలో కలసొచ్చింది.

స్వీట్లు తయారు చేసుకుని జీవనం సాగింగే శంకర్ ఇటీవల తన ఇంట్లోని పాత సామాన్లను అమ్మేద్దామనుకున్నాడు. అన్నింటిని ఒక చోటు చేరుస్తుండగా పాత నాణెమొకటి కనిపించింది. దానిపై మట్టి పేరుకుపోయింది. శుభ్రంగా కడిగి చూడగా దానిపై ఉర్దూ భాషలో కొన్ని అక్షరాలు కనిపించాయి. శంకర్ వెంటనే దగ్గర్లోని మసీదులో ఉన్న ఇమామ్ వద్దకు వెళ్లాడు. అతడు ఆ అక్షరాలను పరిశీలించి.. ’1450, మదీనా’గా నిర్ధారించాడు.

శంకర్ సంతోషంతో ఆ నాణేన్ని ఫొటో తీసి దుబాయ్ లోని మిత్రుడికి పంపాడు. ఆ మిత్రుడు దుబాయ్ షావుకార్లకు సమాచారం అందించాడు. ఓ షేట్ ఆ నాణేన్ని రూ. 1.5 కోట్లకు కొనేందుకు ముందుకొచ్చాడు. అయితే నాణెం చాలా విలువైందని తెలుసుకున్న శంకర్ రూ. 3. 5 కోట్లు ఇస్తేనే నాణేన్ని అమ్ముతానని బేరం పెడుతున్నాడు.