కొత్తబట్టలు ధరించి వృద్ధదంపతుల ఆత్మహత్య - MicTv.in - Telugu News
mictv telugu

కొత్తబట్టలు ధరించి వృద్ధదంపతుల ఆత్మహత్య

November 8, 2019

తెలుగు రాష్ట్రాల్లో వృద్ధ దంపతుల బలవన్మరణాలు రోజురోజుకి పెరిగిపోతున్నాయి. కన్న కొడుకుల నిరాదారణను, వేధింపులను తట్టుకోలేక పెద్దవాళ్లు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. తాజాగా తెలంగాణలోని జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఓ వృద్ధ దంపతులు కొడుకు నిరాదరణ, వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకోవడం కలకలరం రేపుతోంది. 

Old couple.

మహదేవ్ పూర్ మండలం ఎలకేశ్వరం గ్రామానికి చెందిన రాళ్లబండి సాలయ్య, రాధమ్మ దంపతులకు ఓ కొడుకు, ముగ్గురు కూతుళ్లు సంతానం. ముసలాళ్లు కొడుకు వద్దే ఉండేవారు. కొడుకు కోసం సాలయ్య ఇల్లు కూడా కట్టించాడు. అయినా కొడుకు, కోడలు వారిని పట్టించుకోవడం లేదు. ఎంతో ఆత్మాభిమానంతో బతికిన తాము ఒకరి దయాదాక్షిణ్యాలపై బతకలేమని ఆ వృద్ధులు నిర్ణయించుకున్నారు. తమ అంతిమ యాత్రకు అవసరమైన వస్తువులన్నీ ముందే సమకూర్చుకున్నారు. కొత్తబట్టలు ధరించి ఒకరినొకరు కడసారి చూసుకుని, ఆ ఆఖరిక్షణాల్లో కళ్లల్లో కాసింత ఆనందాన్ని నింపుకున్నారు. ఆపై పురుగుల మందు తాగారు. సాలయ్య దంపతుల ఆత్మహత్య కంటే వాళ్లు చనిపోయిన విధానం అందరినీ కలచివేసింది.